AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ల ముందే విద్యార్థి దుర్మరణం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు..!

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నాదర్‌గుల్ నుండి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైకర్‌ రైడర్‌ను ఈడ్చికెళ్లిన భయనక ద‌ృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

కళ్ల ముందే విద్యార్థి దుర్మరణం.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ప్రమాద దృశ్యాలు..!
Meerpet Road Accident
Balaraju Goud
|

Updated on: Feb 17, 2026 | 4:58 PM

Share

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నాదర్‌గుల్ నుండి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థి టిప్పర్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైకర్‌ రైడర్‌ను ఈడ్చికెళ్లిన భయనక ద‌ృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ ప్రాంతానికి చెందిన గొర్రెపోతుల వర్ధన్(19) నాదర్‌గుల్ కృష్ణ సాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ITI మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం (ఫిబ్రవరి 17) ఉదయం రోజులాగే కాలేజీకి బయలుదేరాడు వర్ధన్. నాదర్‌గుల్ నుండి బడంగ్‌పేట్ వైపు వెళ్లే టిప్పర్ లారీని దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రోడ్డు ప్రక్కన నిలిపివేసిన ఆటో ఒక్కసారిగా రోడ్డు మీదికు రావడంతో.. ఆటో తగిలి బైక్ అదుపు తప్పి లారీ ముందు చక్రాల కింద పడింది. ప్రమాదం అనంతరం సుమారు 50 మీటర్ల వరకు లారీ బైకర్‌ను ఈడ్చికెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఈ ఘటనలో విద్యార్థి వర్థన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ టిప్పర్‌ను అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన ఆటోను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..