బంగారం ధరలు జనవరిలో పెరిగి, ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 10 గ్రాముల పుత్తడి ధర రూ.1.56 లక్షల వద్ద ఉంది. జీవనకాల గరిష్ట స్థాయి నుంచి 13.5 శాతం పతనమైంది. అంతర్జాతీయ ధరలు పడిపోతే, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేల నుంచి లక్ష రూపాయలకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.