AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు.. డార్లింగ్ బ్యూటిఫుల్ రివ్యూ..

కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు.. డార్లింగ్ బ్యూటిఫుల్ రివ్యూ..

Phani CH
|

Updated on: Feb 17, 2026 | 1:03 PM

Share

వాలెంటైన్స్ డేకి విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. తనకు 'వర్షం' ఎంత ప్రత్యేకమో, సంతోష్ శోభన్ నటించిన ఈ చిత్రం కూడా సంతోష్‌కు అంతేనని డార్లింగ్ పోస్ట్ చేశారు. ప్రభాస్ స్వీట్ పోస్ట్‌తో ఈ ప్రేమకథా చిత్రానికి అనూహ్యమైన బూస్టప్ లభించగా, యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి ప్రభాస్ పొగడ్తలతో మరింత హైప్ పెరిగింది.

వాలెంటైన్స్ కానుకగా రిలీజ్ అయిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్‌ తన ఓపీనియన్‌ను షేర్ చేశాడు. ఈసినిమా ఎలా ఉందనేది తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. తనకు వర్షం సినిమా ఎలాగో.. యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌కు.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా అలాగ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తన స్వీట్ పోస్ట్‌తో ఈ సినిమా వైపే అందరూ చూసేలా చేశారు డార్లింగ్ ప్రభాస్‌. యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హీరో నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జీవితంలో ఎలాంటి ఆశలు లేని ఓ కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం.. ఆ అమ్మాయితో ఒకే ఇంట్లో గడపాల్సి రావడం.. తర్వాత ఇద్దరి జీవితాల్లోకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది సినిమా ఇతివృత్తం. తాజాగా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇదొక లవ్లీ, బ్యూటీఫుల్ ఫిలిం. కపుల్ ఫ్రెండ్లీ సినిమాను చాలా ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తన పోస్టులో రాసుకొచ్చారు. సంతోష్, మానస వారణాసి జోడి వండర్ ఫుల్ గా ఉందని డార్లింగ్ కోట్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించాడన్నారు. ఇలాంటి కథలను వెండితెరపైకి తీసుకువచ్చినందుకు అజయ్, యువీ క్రియేషన్స్ టీమ్ మొత్తానికి ప్రభాస్‌ అభినందనల తెలియజేశారు. అంతేకాదు తనకు వర్షం సినిమా ఎలాగో.. మై డియర్ సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ సినిమా అలా అవుతుందంటూ ప్రభాస్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడు డార్లింగ్ చేసిన ఈ పోస్ట్ ఈ చిత్రానికి బూస్టప్ లా పని చేయడమే కాదు.. ఈసినిమా వైపు అందరూ పరుగులుపెట్టేలా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం

Prabhas: షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌

Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్

Kova Bun Ali: కోవా బన్‌ వలికి.. మెగా సపోర్ట్‌

జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్

Follow Us