Trisha: తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం
నటి త్రిష, విజయ్‌లపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విజయ్ వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించిన నాగేంద్రన్ వ్యాఖ్యలను త్రిష తీవ్రంగా ఖండించారు, తన ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. డీఎంకే, కాంగ్రెస్, కమల్‌హాసన్ వంటి ప్రముఖులు నాగేంద్రన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
నటి త్రిషపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రగడ మరింత రాజుకుంది. TVK చీఫ్ విజయ్‌పై నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా త్రిషను కూడా వివాదం లోకి లాగారు. సొంతంగా పార్టీ పెట్టి.. తమిళనాడును చక్కదిద్దముందే, విజయ్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలన్నారు నైనార్ నాగేంద్రన్.త్రిషతో సంబంధాలపై తమిళ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. అయితే త్రిష- విజయ్‌పై నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు నేతుల తీవ్రంగా రియాక్టవుతున్న పరిస్థితి. డీఎంకే , కాంగ్రెస్ నేతలతో పాటు కమల్‌హాసన్ కూడా నైనార్య వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మరో వైపు త్రిష కూడా నైనార్ వ్యాఖ్యలపై రియాక్టయ్యారు. నైనార్ నాగేంద్రన్ చేసిన పై త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. తనకు రాజకీయలతో సంబంధం లేదన్న త్రిష. తన వ్యక్తిగత ప్రతిష్టను నైనార్ నాగేంద్రన్ దెబ్బతీశారని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్
Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్
Kova Bun Ali: కోవా బన్ వలికి.. మెగా సపోర్ట్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

