AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babar Azam : నెట్స్ లో కాదు బాబర్ భయ్యా.. పిచ్ మీద ఆడితే కదా గెలిచేది.. ఇక్కడ ఎంత కొట్టినా వేస్ట్

Babar Azam : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ పరిస్థితి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది.

Babar Azam  : నెట్స్ లో కాదు బాబర్ భయ్యా.. పిచ్ మీద ఆడితే కదా గెలిచేది.. ఇక్కడ ఎంత కొట్టినా వేస్ట్
Babar Azam Practice Video
Rakesh
|

Updated on: Feb 17, 2026 | 4:57 PM

Share

Babar Azam : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ పరిస్థితి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. తదుపరి మ్యాచ్‌లో నమీబియాతో తలపడనున్న బాబర్ సేన, ఆ మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పగ తీర్చుకుంటున్నట్లుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది నెట్స్‌లో ప్రదర్శించిన దూకుడు చూస్తుంటే నమీబియాకు ముప్పు తప్పదనిపిస్తోంది.

భారత్‌పై ఘోరంగా విఫలమైన కెప్టెన్ బాబర్ ఆజం, ప్రాక్టీస్ సెషన్‌లో తన కోపాన్నంతా బంతులపై చూపించాడు. హెడ్ కోచ్ మైక్ హెసన్ పర్యవేక్షణలో జరిగిన ఈ సెషన్‌లో బాబర్ చాలా ఆక్రోశంగా బ్యాటింగ్ చేశాడు. నసీమ్ షా, సల్మాన్ మీర్జా వేసిన షార్ట్ పిచ్ బంతులను, బౌన్సర్లను చీల్చి చెండాడాడు. గ్రౌండ్ నలుమూలలా క్లాసిక్ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది కూడా నిప్పులు చెరిగే బంతులతో ప్రాక్టీస్ చేశాడు. బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ షాహీన్ సిక్సర్లతో హోరెత్తించడం విశేషం. ఇండియాపై డకౌట్ అయిన సాహిబ్జాదా ఫర్హాన్ కూడా గంటల తరబడి నెట్స్‌లో చెమటోడ్చాడు.

భారత్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిదిలను జట్టు నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కొలంబోలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌ను చూస్తుంటే వారిద్దరూ నమీబియాపై బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కోచ్ మైక్ హెసన్ ప్రతి ఆటగాడి కదలికలను నిశితంగా గమనిస్తూ, వారికి తగిన సూచనలు ఇస్తున్నారు. నమీబియాను తక్కువ అంచనా వేయకుండా, భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పాక్ ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించినప్పటికీ, అమెరికా మెరుగైన రన్ రేట్‌తో పాక్ కంటే ముందుంది. అమెరికా తన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను పూర్తి చేసేసింది. ఇప్పుడు పాక్ గనుక నమీబియాను ఓడిస్తేనే సూపర్-8 చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ నమీబియా చేతిలో ఓడిపోతే మాత్రం బాబర్ సేన నేరుగా ఇస్లామాబాద్ విమానం ఎక్కాల్సిందే. అందుకే ఈ మ్యాచ్‌ను వారు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!