సుప్రీంకోర్టు యువతీ యువకులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంత నమ్మకం ఉన్నా, పెళ్లికి ముందు శారీరక బంధంలోకి వెళ్లవద్దని సూచించింది. 2020లో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై, మోసపోయిన ఓ యువతి కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలాంటి బంధాలు ప్రమాదకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.