అప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు హీరోయిన్.. బోల్డ్ సీన్లతోనే ఫేమస్..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో నటిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలామంది వస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ సైతం రిపోర్టింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది.
కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు స్టార్ స్టేటస్ మాత్రం సంపాదించుకోలేకపోయింది.
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. హీరోయిన్ శ్రద్ధా దాస్. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ మొత్తం దాదాపు 40 సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. హిందీలో సనమ్ తేరీ కసమ్, దిల్ తో బచ్చా హై జీ, లాహోర్ వంటి చిత్రాల్లో నటించింది.
అలాగే తెలుగులో అనేక సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో విపరీతమైన క్రేజ్ అందుకుంది ఈ వయ్యారి.
ముంబైలో నివసించే బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఈ అమ్మడు ముంబై విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పట్టా పొందిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది.
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ వయ్యారి లాహోర్ సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది.
ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రద్ధా దాస్ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.