AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. హిందుత్వ అజెండాతో కొత్త పార్టీ ఆవిర్భావం

గుజరాత్ ఎన్నికల వేళ.. హిందుత్వ అజెండాతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఐపీఎస్ అధికారి డిజి.వంజారా హిందుత్వ అజెండాత్ ప్రజా విజయ్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. గుజరాత్‌లో డిసెంబర్ నెలలో..

Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. హిందుత్వ అజెండాతో కొత్త పార్టీ ఆవిర్భావం
Dg Vanzara, Ex Ips
Amarnadh Daneti
|

Updated on: Nov 09, 2022 | 11:45 AM

Share

గుజరాత్ ఎన్నికల వేళ.. హిందుత్వ అజెండాతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఐపీఎస్ అధికారి డిజి.వంజారా హిందుత్వ అజెండాత్ ప్రజా విజయ్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. గుజరాత్‌లో డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వంజరా ప్రకటించారు. గతంలో “ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్” అయిన వంజారా.. షేక్ సోహ్రాబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా విజయ్ పార్టీ గుజరాత్ ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని అన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీలు కావని ఆరోపించారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పీవీపీ 182 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే వంజారా ఎన్నికల బరిలోకి దిగుతారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. గుజరాత్ ప్రజలు హిందుత్వేతర పార్టీని అంత తేలికగా అంగీకరించబోరన్నారు. హిందుత్వ పార్టీ మాత్రమే బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని వంజారా తెలిపారు. ‘ప్రజా విజయ్ పార్టీ’ హిందుత్వ పార్టీ అనే విషయాన్ని గుజరాత్ ప్రజలతో పాటు దేశ ప్రజలు తెలుసుకోవాలన్నారు. గుజరాత్‌లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ కావాలనుకునే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సరైన ఎంపిక కాదన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో వంజారాకు బీజేపీ టికెట్ నిరాకరించడంతోనే ఆయన కొత్తపార్టీ పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను వంజారా ఖండించారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించనది కాదని, సిద్ధాంతానికి సంబంధించిన విషయమన్నారు. పార్టీ టిక్కెట్‌ కోసం క్యూలో నిలబడే వ్యక్తిని తాను కాదని అన్నారు. బీజేపీకి కేవలం అధికారం దాహం తప్ప దానికి మించిన మరో దృక్పథం లేదన్నారు. కొత్త రాజకీయ, ఆధ్యాత్మిక దృక్పథంతో ‘ప్రజా విజయ్ పార్టీ’ రంగంలోకి దిగిందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) అధికారులతో సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ పోలీసు అధికారులు 2004లో అహ్మదాబాద్ సమీపంలో ముంబ్రా నివాసి ఇష్రత్ జెహాన్ , మరో ముగ్గురిని నకిలీ ఎన్‌కౌంటర్ చేశారనే ఆరోపణలు వంజారాపై ఉన్నాయి. 2005లో సోహ్రాబుద్దీన్, తులసి ప్రజాపతి బూటకపు ఎన్‌కౌంటర్‌ల కేసులో ఎనిమిది సంవత్సరాలు జైలులో ఉన్న ఆయన 2015లో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత 2017లో నిర్దోషిగా విడుదలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..