FASTag: కేంద్రం సంచలన నిర్ణయం.. ఫాస్టాగ్ వాడేవారికి భారీ ఊరట
ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారా..? అయితే జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం కానుకగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక కేవైవీ ప్రక్రియను రద్దు చేసింది. దీంతో వాహనదారులకు ఊరట లభించినట్లయిందని చెప్పవచ్చు.

కొత్త ఏడాది సందర్బంగా ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం లభించింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఉపయోగించే ఫాస్టాగ్ విషయంలో నో యువర్ వెహికిల్(KYV)ను తాజాగా రద్దు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురానున్నట్లు గురువారం ప్రకటించింది. ఫాస్టాగ్ యాక్టివేషన్ తర్వాత పదే పదే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో పాటు బ్యాంక్ ఫాలో-అప్ విషయంలో లక్షలాది మంది వాహనదారులు ఎప్పటినుంచి అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో లైట్ మోటార్ వెహికిల్ (LMV) కేటగిరీలో వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత కొంతకాలం నుంచి భావిస్తోంది.
ఇక కేవైవీకి చెక్
ఫాస్టాగ్ పోస్ట్-యాక్టివేషన్ వెరిఫికేషన్ ఫీచర్ నిలిపివేసిన తర్వాత KYV అవసరం లేదని NHAI భావించింది. వాహనానికి సంబంధించి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాతనే ఫాస్టాగ్ ప్రీ-యాక్టివేట్ తప్పనిసరి అని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా కేవేవీ ప్రక్రియ అవసరం లేదని తన ప్రకటనలో తెలిపింది. ఫాస్టాగ్‌ను దుర్వినియోగం చేయడం లేదా సరిగ్గా అంతికపోవడం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అనేది అవసరం పడుతుందంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారులకు ప్రయోజనం కలగనుంది.
