AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ బోగీల మధ్య ప్రమాదకరంగా ప్రయాణించిన ఓ యువకుడు హల్చల్ సృష్టించాడు. రైల్వే పోలీసులు గుర్తించి, అతనికి నచ్చజెప్పి కిందికి దించారు. విచారణలో యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని తెలిసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ట్రైన్‌ ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకునే ప్రయత్నం.. చివరకు ఏం జరిగిందంటే?
Gorakhpur Express Incident
Naresh Gollana
| Edited By: |

Updated on: Jan 01, 2026 | 10:09 PM

Share

గోరఖ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు బోగీల మధ్య కూర్చొని ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా కిలో మీటర్ల మేర ఆ ట్రైన్‌లో ఆ బోగీల మధ్య నే పడుకొని ప్రయాణం చేశాడు. తీరా రైల్వే స్టేషనుకు రాగానే కొందరు ప్రయాణికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రైన్‌ను ఆపేశారు. ట్రైన్ ఆగడమే ఆలస్యం ఆ యువకుడు ట్రైన్ పైకి ఎక్కి మరింత హల్చల్ చేశాడు. హై టెన్షన్ వైర్లను పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. అలర్ట్ అయిన రైల్వేపోలీసులు.. ఆ యువకుడికి నచ్చ చెప్పి కిందికి‌ దించారు. తీరా పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

విషయంలోకి వెళితే.. మంచిర్యాల జిల్లా రైల్వేస్టేషన్‌లో గోరఖ్ పూర్ ట్రైన్ ఎక్కి ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. చంద్రపూర్‌లో గోరఖ్ పూర్ ట్రైన్ ఎక్కిన జయశంకర్ అనే వ్యక్తి రైలు రెండు బోగీల మధ్య ఏసీ పైపుల పైన కూర్చొని‌ ప్రయాణం చేశాడు. తీరా మంచిర్యాల రైల్వే స్టేషను రాగానే కొందరు ప్రయాణికులు గుర్తించి కేకలు వేయడంతో ట్రైన్‌ను నిలిపివేశారు. గుర్తించి ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. ట్రైన్ పైకి ఎక్కి వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆ యువకుడికి నచ్చ చెప్పి కిందకు దించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి‌పీల్చుకున్నారు.

యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఆదార్ ఆదారంగా ఆ యువకుడిది మెదక్ జిల్లా లోని బూరుగుపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో అతనికి గత కొద్ది రోజులు మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుసుకున్నారు. దీంతో వచ్చి అతన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు తెలపగా.. అక్కడికి చేరుకున్న అతని ఫ్యామిలీ ఆ వ్యక్తిని తీసుకెళ్లారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.