AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా.. కూతురి వయసున్న బాలికను ఎత్తుకెళ్లి..

పొలం పనులకు వెళ్ళిన 16 ఏళ్ళ బాలికను మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్ళి ఐదురోజులు లాడ్జిలో ఉంచి ఓ కామాంధుడు తన పశువాంఛను తీర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాలని బాలిక ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

Andhra News: ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా.. కూతురి వయసున్న బాలికను ఎత్తుకెళ్లి..
Andhra Crime
Fairoz Baig
| Edited By: |

Updated on: Jan 01, 2026 | 9:21 PM

Share

ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన ఓ కేటుగాడు.. ఆమెపై అత్యాచారికి పాల్పడ్డాడు. బాలిక కనిపించడం లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేసి అతని ఆచూకీ కనుగొన్నారు. వెంటనే అక్కడికి చేరుకొని బాలికను నిందితుడి చెరనుంచి విడిపించి తీసుకొచ్చారు. కానీ నిందితుడిని మాత్రం పోలీసులు అరెస్ చేయలేదు. విషయం తెలిసిన ఒంగోలులోని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర బాలిక తల్లితో మాట్లాడి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. అనతరం నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.

రాగుల శ్రీను అనే వ్యక్తి 2025 డిసెంబర్ నెల 26వ తారీకున పనికి వెళ్లిన పదహారేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి పొలం నుండి బైకు ఎక్కించుకొని నాగార్జున సాగర్‌కు తీసుకెళ్ళాడు. ఐదు రోజులు లాడ్జిలో నిర్బంధించి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి కురిచేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మొదట మిస్సింగ్ కేసుగా క్రైమ్ నెంబర్ 96/25 గా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే బాలిక తల్లిదండ్రులు రాగుల శ్రీనుపై అనుమానం వ్యక్తం చేయడంతో అతని ఫోన్‌ నెంబర్‌ను ట్రేస్ చేశారు పోలీసులు.

దీంతో అతను నాగార్జున సాగర్‌లో ఉన్నట్టు తెలుసుకున్న కురిచేడు ఎస్‌ఐ శివ.. తన సిబ్బందితో నాగార్జునసాగర్ వెళ్లి బాలికను రక్షించారు. అయితే నిందితుడు రాజకీయ ప్రాబల్యంతో కేసు రాజీ కోసం బేరసారాలు నడిపించారు. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్న విషయంలో వైద్య పరీక్షలు నిర్వహించలేదు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న ఒంగోలులోని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర రంగంలోకి దిగారు. దర్శి సిఐతో మాట్లాడి బాలికకు వైద్య పరీక్షలు చేసేలా వత్తిడి తెచ్చారు. దర్శిలో లేడీ డాక్టర్ లేకపోవటంతో నేరుగా ఒంగోలు జిజిహెచ్‌ లోని సఖి సెంటర్‌కు బాలికను పోలీసులు తీసుకొచ్చారు. కానీ అక్కడ బాలికకు వైద్య చికిత్సలు చేయించకుండా కాలయాపన చేశారు.

దీంతో మాల మహానాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి హాస్పటల్‌కు వెళ్లి ఇన్చార్జి సూపరింటెండెంట్‌ నామినేని కిరణ్‌తో ఫోన్లో మాట్లాడారు. నామినేని కిరణ్ ఆదేశాలతో వెంటనే వైద్యురాలు సఖి సెంటర్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేశారు. ఒంగోలు తాలూకా మహిళా పోలీసులు ప్రత్యేకంగా బాధితురాలి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసి ఐదురోజులు లాడ్జిలో అత్యాచారం చేసిన కిడ్నాపర్, రేపిస్ట్ రాగుల శ్రీనును అరెస్టు చేయాలని ఎస్‌సి సంఘాల నేతలు నీలం నాగేంద్ర, దారా అంజయ్య, కాకుమాను రవి డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.