AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు ఉద్యోగం మాటున పాడుపని.. సెలవు పెట్టి మరీ గంజాయి దందా..చివరికి..!

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా ఓ హోంగార్డు ప్రవర్తించాడు. గంజాయి రవాణా, వాడకంపై పోలీసులు ప్రతిరోజూ ఉక్కుపాదం మోపుతుంటే, అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఖాకీ డ్రెస్ అడ్డం పెట్టుకుని ఏకంగా గంజాయి వ్యాపారానికే తెరలేపాడు. తనను ఎవరూ ఆపలేరనే అహంతో బరితెగించిన సదరు హోంగార్డును తోటి పోలీసులే పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు.

పోలీసు ఉద్యోగం మాటున పాడుపని.. సెలవు పెట్టి మరీ గంజాయి దందా..చివరికి..!
Home Guard Arrest
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 8:26 PM

Share

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా ఓ హోంగార్డు ప్రవర్తించాడు. గంజాయి రవాణా, వాడకంపై పోలీసులు ప్రతిరోజూ ఉక్కుపాదం మోపుతుంటే, అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఖాకీ డ్రెస్ అడ్డం పెట్టుకుని ఏకంగా గంజాయి వ్యాపారానికే తెరలేపాడు. తనను ఎవరూ ఆపలేరనే అహంతో బరితెగించిన సదరు హోంగార్డును తోటి పోలీసులే పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కు నెట్టారు.

కడప నగరంలోని ప్రకాష్ నగర్ ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో కడప చిన్నచౌక్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. అయితే వారిని విచారించిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ తెలిసింది. పట్టుబడిన వారిలో ఒకరు కడప నగరంలోని కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రమేష్ కావడం గమనార్హం. సొంత డిపార్ట్‌మెంట్‌కు చెందిన వాడే కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారుల ముందు ప్రవేశపెట్టారు.

కడప అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోంగార్డుగా పనిచేస్తున్న రమేష్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ దందాకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం ఏకంగా నాలుగు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టాడు. రైలులో ఒరిస్సా బోర్డర్‌కు చేరుకుని, అక్కడ ఏనుగగూడ గ్రామానికి చెందిన నగేష్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేశాడు. పోలీసు ఐడెంటిటీ కార్డును చూపిస్తూ, వివిధ మార్గాల ద్వారా ఆ గంజాయిని కడపకు చేర్చాడు.

కడపకు తెచ్చిన గంజాయిని స్థానికంగా ఉండే చిలకల చాంద్ బాషా, అతని భార్య సుబ్బమ్మతో పాటు మరికొందరికి రమేష్ ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు మాట్లాడుతూ.. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం గంజాయి విక్రయాలు, రవాణా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా యువతపై ప్రత్యేక దృష్టి సారించామని, రాపిడ్ కిట్ల ద్వారా వెంటనే గంజాయి టెస్టులు నిర్వహించి, మత్తు పదార్థాలు తీసుకున్నట్లు తేలితే చట్టప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. సమాజాన్ని రక్షించాల్సిన వృత్తిలో ఉండి, కేవలం డబ్బు కోసం ఆశపడి గంజాయి వ్యాపారానికి ఒడిగట్టిన హోంగార్డు రమేష్ ఉదంతం పోలీస్ శాఖకే తీరని అవమానంగా నిలిచింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us