Gujarat Elections: గుజరాత్ ఎన్నికల వేళ.. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎలక్షన్స్.. ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకేనా..
దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి గుజరాత్ ఎన్నికలు.. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో సత్తా..

దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి గుజరాత్ ఎన్నికలు.. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తహతహలాడుతోంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది. ఎప్పుడూ ద్విముఖ పోరు కన్పించే గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు ఉండే అవకాశాలు లేకపోలేదు. గుజరాత్ ఎన్నికల సమయంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. గత శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఢిల్లీ నగరంలో ఎన్నికల కోలహలం మొదలైంది. గుజరాత్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి, పార్లమెంటు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గత కొన్నేళ్లుగా పరాభావం తప్పడంలేదు. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పేషన్ ఎన్నికలు, గుజరాత్ శాసనసభ ఎన్నికలు ఒకే సమయంలో జరగనుండటంతో.. ఈ సారి ఎలాగైనా మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీలో పాగా వేయాలన్న కేజ్రీవాల్ ప్రయత్నానికి అడ్డుకట్టగా చెప్పుకోవచ్చు. ఈఏడాది మార్చిలో ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి సిద్ధం కాగా, కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే రాష్ట్ర ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు.
డిసెంబర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం షెడ్యూల్ విడుదలైంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల వేళ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ్కి ఇబ్బంది కలిగించేది ఉండొచ్చు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల డిసెంబర్ 1, 5వ తేదీల్లో జరగనున్నాయి. ఢిల్లీ ప్రజలు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. గుజరాత్ ఎన్నికలు ముగిసే వరకు ఈ ఎన్నికలు వాయిదా వేయాలని కోరడానికి ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేదు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 12వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.
ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్‌కు రాజకీయంగా ఇదొక సవాల్ అని చెప్పుకోవాలి. తన సొంత గడ్డపై దృష్టిపెట్టాలా లేక.. గుజరాత్ ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం వెచ్చించాలా అనేది ఆయనకు ఎదురయ్యే మొదటి ప్రశ్న. ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన పునాది అంటూ లేదు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఆ పార్టీలో ముఖ్యమైన ఆకర్షనీయమైన నాయకుడు. ఆయనను మాత్రమే దేశంలో ప్రజలు ఎక్కువుగా గుర్తించగలరు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికి కేజ్రీవాల్‌కు ఉన్న గుర్తింపు ఆ పార్టీలో మిగతా వారికి లేదనే చెప్పుకోవాలి. గుజరాత్‌లో కూడా అరవింద్ కేజ్రీవాల్ కంటే ప్రజలను ఆకర్షించేగలిగే నాయకుడు ఆ పార్టీలో లేరనే చెప్పుకోవాలి. దీంతో గుజరాత్, ఢిల్లీ రెండు ఎన్నికలపై దృష్టిసారిస్తే ఇది బీజేపీకి ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది.




ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో బిజెపిని అధికారం నుండి గద్దె దింపడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని తెలిసినప్పటికి అక్కడ సత్తా చాటాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. దానికి తగిన వ్యూహలను అరవింద్ కేజ్రీవాల్ రూపొందిస్తున్నారు. గుజరాత్‌పై దృష్టి సారించేందుకు నవంబర్ 12వ తేదీన పోలింగ్ జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ తన ఏకాగ్రతను తగ్గించింది. అంటే అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికలను ఎంత ప్రటిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది. గుజరాత్‌లో ఎన్ని సీట్లు గెలుచుకున్నా, ఆ రాష్ట్రంలో కనీసం 6 శాతం ఓట్లు సాధించడం ఆమ్ ఆద్మీ ముందు ఉన్న కీలక అంశం. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపాలన్నదే ఆమ్ ఆద్మీ పార్టీ ఎత్తుగడగా తెలుస్తుంది. తద్వారా జాతీయ పార్టీ హోదా పొందాలన్నదే అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనగా అర్థమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..