ఆకాశంలో మరోమారు అదే మిస్టరీ ! దేశ రాజధాని ఆకాశ వీధుల్లో “ఎగిరే పళ్లెం’ కలకలం..

అయితే, చాలా చోట్ల ప్రజలు ఫ్లయింగ్‌ సాసర్‌లను చూశామని చెప్పుకుంటారు. ఫ్లయింగ్‌ సాసర్లు నిజమోకాదో తెలసుకోవడానికి చాలా ఏజెన్సీలు వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాయి.

ఆకాశంలో మరోమారు అదే మిస్టరీ ! దేశ రాజధాని ఆకాశ వీధుల్లో ఎగిరే పళ్లెం' కలకలం..
Alien
Follow us

|

Updated on: Nov 08, 2022 | 12:13 PM

ఫ్లయింగ్​ సాసర్..ఈ పేరు విని చాలా రోజులు అవుతుంది కదా..? ఫ్లయింగ్ సాసర్.. అంటే ఎగిరే పళ్లెం.. మానవ చరిత్రలో జరిగిన గొప్ప అద్భుతాలలో ఇది కూడా ఒకటి. ఇలాంటి ఫ్లయింగ్‌ సాసర్‌లను చాలా మంది వివిధ ప్రాంతాల్లో చూశారని చెబుతున్నారే తప్ప వాటి గురించి సరైన సమాచారం లేదు. అయితే, చాలా చోట్ల ప్రజలు ఫ్లయింగ్‌ సాసర్‌లను చూశామని చెప్పుకుంటారు. ఫ్లయింగ్‌ సాసర్లు నిజమోకాదో తెలసుకోవడానికి చాలా ఏజెన్సీలు వేల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ ఆకాశంలో కనిపించిన భారీ ఫ్లయింగ్‌ సాసర్‌ జనంలో విపరీతమైన ఉత్సకతను రేకెత్తించింది. ఎగిరే పళ్లెం ఫోటో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. గ్రహంతరవాసుల సందర్శన గురించిన కథనాలు కూడా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. భవనాలపై ఆకాశంలో భారీ సాసర్‌ చిత్రాన్ని ప్రచారం చేశారు. గ్రహాంతర కథనాలు విస్తృతంగా వ్యాపించడంతో, నిజం ఏమిటో స్పష్టం తెలుసుకోవడం కోసం కొందరు సోషల్ మీడియా ద్వారా లోతైన పరిశోధన చేశారు. అసలు మిస్టరీని చేధించారు. అది ఎగిరే పళ్లెం కాదు, ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం అని కనిపెట్టారు.

ఇవి కూడా చదవండి

వాయుకాలుష్యం కారణంగా ఫ్లయింగ్‌ సాసర్‌ల కనిపించే భారీ తాగునీటి ట్యాంక్‌ చిత్రం. ట్యాంక్‌పై భాగం మాత్రమే కనిపిస్తుంది. వాయు కాలుష్యంతో దిగువ భాగం మరుగున పడింది. దీంతో ట్యాంక్‌ గాలిలో ఎగిరే పళ్లెంలా తయారైంది. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పెద్ద వాహనాలపై ఆంక్షలు విధించి పాఠశాలలు మూసివేశారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు గత కొన్ని రోజులుగా స్వల్ప మెరుగుదల తర్వాత బుధవారం తిరిగి తెరువబడ్డాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి