ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం .. ఈ ఒక్క రాశి వారికి ఇది జాక్‌పాట్‌.. ధనవంతులు అవుతారు!

కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ ప్రాతినిధ్యం పెరుగుతుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది.

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం .. ఈ ఒక్క రాశి వారికి ఇది జాక్‌పాట్‌.. ధనవంతులు అవుతారు!
Lunar Eclipse 2022
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 08, 2022 | 10:12 AM

2022 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. ఈ చంద్రగ్రహణం 08 నవంబర్ 2022 మంగళవారం అంటే ఈరోజు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి, దాని సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. చంద్రగ్రహణం సూతక్ కాలం 09 గంటల ముందు ప్రారంభమవుతుంది. భారతదేశంలో చంద్రగ్రహణం సాయంత్రం 05:20 నుండి ప్రారంభమై సాయంత్రం 06.20 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులు అవుతారు. వారి జీవితం అదృష్టవంతంగా ఉంటుంది. ఇది ఏ రాశివారికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం తుల రాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఈ సమయంలో, ఆర్థిక, వ్యాపార రంగంలో శుభ సంకేతాలు అందుతాయి. మీరు పురోగతితో మీ కెరీర్‌లో కొన్ని కొత్త బాధ్యతలను చేపడతారు. దీంతో పాటు కొత్త పనులతో యువతకు నిరుద్యోగం దూరమవుతుంది. నిరుద్యోగ యువకులు కొత్త ఉద్యోగం పొందుతారు. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి ఆనందాన్ని పొందుతారు.

తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీ డబ్బుకు సంబంధించి నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీలలో విజయం సాధిస్తారు. బ్యాంకు పనులన్నీ పూర్తవుతాయి. దీంతో వైవాహిక జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

ఇది పని రంగంలో మార్పుకు అవకాశం కల్పిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ద్రవ్య లాభాల కొత్త దిశలు సృష్టించబడతాయి. దీని కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. మీ కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిలిచిపోయిన పాత పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ ప్రాతినిధ్యం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది. ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది.

చంద్రగ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు.. 1. సూతక్ కాలం లేదా గ్రహణం సమయంలో ఎలాంటి ప్రయాణాలు, వ్యాపార కార్యకలాపాలు చేయడం మానుకోండి. ఎందుకంటే గ్రహణం భౌతిక కార్యకలాపాలకు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

2. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణం, సూతకాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

3. గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావం మీ జీవితంపై పడబోతుంటే, అది తొలగిపోతుందని అంటారు.

4. సూతక్ కాలంలో ఏదైనా తినడం, తాగడం మానుకోండి.

చంద్రగ్రహణం నివారణ

1. చంద్రగ్రహణం సమయంలో వీలైనంత ఎక్కువగా పూజలు, ధ్యానం చేయండి. ఈ విధంగా దేవతలను ఆరాధించడం శుభప్రదం.

2. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తిని నివారించడానికి ఓం నమః శివః జప్‌, శివ జప్, హరి-ఓం మంత్రం, మృత్యుంజయ జప్, దుర్గా మంత్రం, గణేష మంత్రాలను పఠించడం మంచిది.

3. జీవితంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చంద్రగ్రహణం సమయంలో రోగ నివారణ పూజ చేయడం మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.  నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!