Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లక్షణాలు ఉంటే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉన్నట్లే.. నిర్లక్ష్యం చేయకండి!

దీని వల్ల హై బీపీ, గుండెపోటు, పక్షవాతం, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, మీరు లక్షణాలను గుర్తించి సమయానికి చికిత్స ప్రారంభించినట్లయితే అప్పుడు భయపడాల్సిన పని లేదు.

ఈ లక్షణాలు ఉంటే గుండె నొప్పి వచ్చే అవకాశం ఉన్నట్లే.. నిర్లక్ష్యం చేయకండి!
Heart Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 08, 2022 | 7:25 AM

గుండెపోటు..ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ప్రధాన సమస్యగా మారింది. మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజల జీవనశైలిలో మార్పుల కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం, అతిగా వ్యాయామం చేయడం వంటి అనేక అంశాలు గుండెపోటు కేసుల పెరుగుదలకు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్న వయస్సులోనే వస్తున్న గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గుండెపోటుకు ముందు చాలా సార్లు, గుండెలో వాపు ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను ప్రభావితం చేస్తుంది. గుండెపోటు ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పనప్పటికీ మీ శరీరంలోని కొన్ని భాగాలు గుండెపోటు రాబోతుందని సూచిస్తాయి. గుండెలో మంటతో ద్వారా కూడా హెచ్చరిస్తుంది. ఈ సంకేతాలను సకాలంలో గుర్తించి, వెంటనే చికిత్స పొందితే, భారీ నష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

సైన్స్ భాషలో చెప్పాలంటే గుండె మంటను మయోకార్డిటిస్ అంటారు. అటువంటి పరిస్థితిలో, గుండె కండరాలలో వాపు ఏర్పాడుతుంది. దీని కారణంగా శరీరానికి రక్త సరఫరా అడ్డుకుంటుంది. దీని వల్ల హై బీపీ, గుండెపోటు, పక్షవాతం, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, మీరు లక్షణాలను గుర్తించి సమయానికి చికిత్స ప్రారంభించినట్లయితే అప్పుడు భయపడాల్సిన పని లేదు.

శరీరంలోని లక్షణాలు: – శ్వాస తీసుకోవడంలో అసౌకర్య భావన

ఇవి కూడా చదవండి

– ఛాతీలో నొప్పి

– జ్వరంతో కూడిన గొంతు నొప్పి

– తల తిరుగుతున్నట్లు, మూర్ఛగా అనిపించడం

– కీళ్ల నొప్పి, తలనొప్పి

– గుండెకొట్టుకోవడం మరీ ఎక్కువగా అనిపించటం

– నీరసంగా, అలసటగా అనిపిస్తుంది

గుండె సమస్యలకు కారణాలు:

– పెన్సిలిన్స్, సల్ఫోనామైడ్స్ వంటి యాంటీబయాటిక్స్ వంటి మందులు తీసుకునేటప్పుడు.

– ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా.

– స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

– కరోనా, అడెనోవైరస్, హెపటైటిస్ వంటి వైరస్‌ల వల్ల వస్తుంది.

గుండె పోటును ఎలా నివారించాలి?

– రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

– శ్వాస వ్యాయామాలు, యోగా చేయండి.

– ఆరోగ్యకరమైన ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి