Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అంతా ప్రేమ కోసమే..’ విద్యార్థినిపై ప్రేమతో లింగం మారి పెళ్లి చేసుకున్న పీటీ టీచర్!

జెండర్ రీఅసైన్‌మెంట్ సర్జరీ ప్రొవైడర్లు ఉన్నారు. అక్కడికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని, 2019 నుంచి ట్రీట్‌మెంట్‌, 2021 చివరి సర్జరీ, నేను ఆడపిల్లగా పుట్టాను కానీ మొదటి నుంచి అబ్బాయినే అనిపించింది.

'అంతా ప్రేమ కోసమే..' విద్యార్థినిపై ప్రేమతో లింగం మారి పెళ్లి చేసుకున్న పీటీ టీచర్!
Gender Changed
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2022 | 1:10 PM

ప్రేమ కోసం మనిషి ఏమైనా చేస్తాడని ఇప్పటికే రుజువైంది. ప్రేమ కోసం సర్వం పోగొట్టుకున్న వారిని చూశాం, ఎంతో సంపాదించిన వారినీ చూశాం. అయితే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ స్కూల్ టీచర్ ప్రేమ కోసం తన లింగ మార్పిడి చేయించుకున్నారు.. లింగమార్పిడి ద్వారా పాఠశాల ఉపాధ్యాయురాలు తను పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థినిని వివాహం చేసుకుంది. పీఈటీ టీచర్ అయిన మీరా డీగ్ సబ్ డివిజన్ మోతీ కా నాగ్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నట్లు తెలిసింది. పాఠశాలలో చదువుతున్న కల్పన అనే విద్యార్థినికి మీరా కబడ్డీ ఆట నేర్పేది. అంతే కాదు, సదరు విద్యార్థిని రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నిలవడంలో మీరా కీలకపాత్ర పోషించింది. మీరా ఆట నేర్పిస్తూనే కల్పనతో ప్రేమలో పడింది.

మీరా కబడ్డీ ఆడతానని చెబుతూనే కల్పనతో ప్రేమలో పడటం ప్రారంభించింది. వీరి మధ్య పెళ్లి ప్రస్థావనకు వచ్చే సరికి మీరా తన లింగాన్ని మార్చుకుని ఆరవ్ అనే అబ్బాయిగా మారింది. రెండు రోజుల క్రితం ఆరవ్, కల్పన వివాహం చేసుకున్నారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి ఫోటోలకు ఇద్దరూ సంతోషంగా ఫోజులిచ్చారు.. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ కూడా అభ్యంతరం చెప్పలేదు. సంతోషంగా పెళ్లి జరిపించారు. లింగమార్పిడి తర్వాత తన పేరును ఆరవ్‌గా మార్చుకున్నానని, ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నానని మీరా తెలిపింది. అదే గ్రామానికి చెందిన కల్పన అనే విద్యార్థిని కబడ్డీ ఆటలో నిష్ణాతురాలు. ఆట నేర్పిస్తూనే ఇద్దరం ప్రేమలో పడ్డామని చెప్పారు.

ఆరవ్ చెప్పిన మాటల్లో.. తాను మొదటి నుండి అబ్బాయిగానే ప్రవర్తించేవాడిని.. మొదటి నుండి నేను నా లింగమార్పిడి చేసుకోవాలని అనుకునేవాడిని. 2012లో ఎవరో ఒకరికి లింగమార్పిడి జరిగిందని వార్తల్లో చదివాను. అప్పటి నుంచి ఇదంతా ఎప్పుడు జరుగుతుందా..? అని ఆలోచించేవాడిని. అనంతలోనే యూట్యూబ్ ద్వారా దీనికి డాక్టర్ ఉన్నారని తెలిసింది. ఢిల్లీలో జెండర్ రీఅసైన్‌మెంట్ సర్జరీ ప్రొవైడర్లు ఉన్నారు. అక్కడికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని, 2019 నుంచి ట్రీట్‌మెంట్‌, 2021 చివరి సర్జరీ, నేను ఆడపిల్లగా పుట్టాను కానీ మొదటి నుంచి అబ్బాయినే అనిపించింది. నా లింగాన్ని మార్చి 2 రోజుల క్రితం నా విద్యార్థిని కల్పనతో వివాహం జరిగింది. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారని ఆరవ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి
Female Physical Teacher

వధువు కల్పన మాట్లాడుతూ.. “మీరా మా స్కూల్‌లో ఫిజికల్ టీచర్‌గా పనిచేశారు. 10వ తరగతి నుంచి నాకు క్రీడల్లో సహాయం చేసింది. నా క్రీడ కబడ్డీ..ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే..అది నా భర్త ఆరవ్‌ వల్లే సాధ్యమైందని చెప్పింది.. అతను ఎప్పుడూ నాతోనే ఉండాలని భావించాను. నా కోరిక నెరవేరిందని కల్పన సంతోషంగా చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి