Cheetahs Released: ఆ చీతాలకు స్వేచ్ఛ.. క్వారంటైన్‌ తర్వాత అడవిలోకి.. ఆఫ్రీకానుంచి భారత్‌కు వచ్చిన అతిధులు..

Cheetahs Released: ఆ చీతాలకు స్వేచ్ఛ.. క్వారంటైన్‌ తర్వాత అడవిలోకి.. ఆఫ్రీకానుంచి భారత్‌కు వచ్చిన అతిధులు..

Anil kumar poka

|

Updated on: Nov 08, 2022 | 9:57 AM

అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న చిరుతల సంఖ్యను దేశంలో మళ్లీ పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుంచి చిరుతలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న చిరుతల సంఖ్యను దేశంలో మళ్లీ పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుంచి చిరుతలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఈ చీతాలు భారత భూభాగంలో అడుగుపెట్టాయి. ఈ ప్రాజెక్ట్‌కు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. ఏకంగా ప్రత్యేక విమానంలో చీతాలను భారత్‌కు తరలించారు. నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు మొత్తం 8 చిరుతలను తీసుకొచ్చారు.పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన పులులను క్వారంటైన్‌లో ఉంచారు. సీసీటీవీ కెమెరాలతో నిత్యం వాటిని గమనిస్తున్నారు. కొత్త వాతావరణానికి పులులు ఎలా స్పందిస్తున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయి లాంటి వివరాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్వారంటైన్‌లో ఉన్న పులులను తొలిసారి అడవిలోకి వదిలేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. రెండు చీతాలు క్వారంటైన్‌ను వీడి అడవిలోకి వెళ్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘గొప్ప వార్త.. క్వారంటైన్‌ ముగిసిన తర్వాత కునో అటవీ ప్రాంతలోకి రెండు పులులు ప్రవేశించాయి. త్వరలోనే మిగతా వాటిని కూడా విడుదల చేస్తారు. అన్ని చీతాలు ఆరోగ్యంగా, చలాకీగా ఉండడం సంతోషకరం’ అని రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

 

Published on: Nov 08, 2022 09:56 AM