Crocodile-Crane: మొసలి వీపునెక్కి కొంగ స్వారీ.. కొలనులో బోటు షికారులా ఎంజాయ్ చేస్తున్న కొంగ..
సాధారణంగా మొసలి నీటిలో ఉండగా దాని దరిదాపులకు కూడా ఏ జంతువు వెళ్లదు. ఎందుకంటే నీటిలో ఉండగా మొసలికి చిక్కితే తప్పించుకోవడం సాధ్యం కాదు. అలాంటిది ఓ మొసలి వీపుపైనెక్కి స్వారీ చేస్తోంది ఓ కొంగ.
ఈ వీడియోలో ఓ కాలువలో పెద్ద పెద్ద మొసళ్లు ఉన్నాయి. చుట్టూ చెట్లు ఇంకా అక్కడున్న నివాసాల పైన కొన్ని కొంగలు ఉన్నాయి. అయితే ఓ కొంగ చేపలకోసమే వెళ్లిందో, లేక ఆ కాలువలో బోటు షికారు చెయ్యాలనుకుందో కానీ ఓ మొసలి వీపుపై వాలింది. చుట్టూ ఇంకా వేరే మొసళ్లు కూడా ఉన్నాయి. అయినా భయపడకుండా ఆ మొసలి వీపునెక్కి చక్కగా బోటు షికారు చేస్తుంది. ఆ మొసలి కూడా కొంగకు ఏ హానీ తలపెట్టకుండా పడవ మాదిరిగా నీటిలో ఈదుతూ తిప్పుతోంది. చుట్టూ ఉన్న మొసళ్ళు కూడా కొంగ తమ ఇంటికి వచ్చిన అతిథి అన్నట్లుగా వ్యవహరించాయి. అవికూడా కొంగకు ఎలాంటి హానీ చెయ్యలేదు. ఈ క్యూట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించగా వేలల్లో లైక్ చేశారు. ఓ యూజర్ వీడియోపై కామెంట్ చేస్తూ, ‘పక్షి ఉబర్ రైడ్‌ను ఆస్వాదిస్తున్నట్లుంది’ అని కామెంట్ చేయగా.. ఇది నిజమైన డేంజర్ ప్లేయర్’ అని మరొకరు, ‘వీరు నిజమైన స్నేహితులు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..