Weird Food: ఆలూ కర్రీతో జిలేబీ తిన్న ఫుడ్‌ బ్లాగర్‌.. నీ టేస్ట్‌ తగలెయ్యా అంటూ మండిపడుతోన్న ఫుడ్‌ లవర్స్‌

'విచిత్రమైన ఫుడ్‌ కాంబినేష‌న్‌ను ప్రయత్నించా. మ‌ధుర‌, వృందావ‌న్‌లో ఆలూ కీ స‌బ్జీతో జిలేబి చాలా ఫేమ‌స్‌. అందుకే ఈ కాంబోను మిస్‌ అవ్వలేదు' అని  దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది పాలక్.

Weird Food: ఆలూ కర్రీతో జిలేబీ తిన్న ఫుడ్‌ బ్లాగర్‌.. నీ టేస్ట్‌ తగలెయ్యా అంటూ మండిపడుతోన్న ఫుడ్‌ లవర్స్‌
Jalebi With Aloo Curry
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2022 | 12:42 PM

నాలుక కొత్త దనం కోరుకుంటేందేమో కానీ ఇటీవల కొందరు వినూత్న వంటకాలను తయారుచేస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో వెరైటీ రెసిపీలు తయారుచేస్తున్నారు. అంతేకాదు తమ వంటకాల తయారీ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అలా ఈ మధ్యన వెరైటీ ఫుడ్ కాంబినేష‌న్లు సోష‌ల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా అలాంటి మరో వంటకమే నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఓ ఫుడ్‌ బ్లాగర్‌ ఆలూ స‌బ్జీతో జిలేబీని రుచి చూసింది. ఈ సందర్భంలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌, రియాక్షన్స్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.  కాగా ఈ విచిత్రమైన ఫుడ్ కాంబినేష‌న్ మ‌ధుర‌లోని ఓమా పెహెల్వాన్‌లో అందుబాటులో ఉంటుందట. తాజాగా అక్కడికి వెళ్లిన ఫుడ్‌ బ్లాగర్‌ పాల‌క్ క‌పూర్ దీనిని టేస్ట్‌ చేసిందట. అంతేకాదు ‘విచిత్రమైన ఫుడ్‌ కాంబినేష‌న్‌ను ప్రయత్నించా. మ‌ధుర‌, వృందావ‌న్‌లో ఆలూ కీ స‌బ్జీతో జిలేబి చాలా ఫేమ‌స్‌. అందుకే ఈ కాంబోను మిస్‌ అవ్వలేదు’ అని  దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది పాలక్.

ప్రస్తుతం ఆలూకీ జిలేబి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. కొందరు పాలక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఈ వెరైటీ ఫుడ్‌ కాంబోపై పెదవి విరుస్తూ విరుచుకు పడుతున్నారు. మీ టేస్ట్‌ తగలెయ్యా? అసలు దీన్ని ఎవరైనా తింటారా? అసలు ఇదేం కాంబినేషన్‌ ‘అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కొందరు ఓరియో బిస్కెట్లతో బజ్జీలు, పకోడ, ఆమ్లెట్లు కూడా తయారుచేసిన సంగతి తెలిసిందే. వీటిపై కూడా ఫుడ్‌ లవర్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలసిందే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Palak Kapoor (@whatsupdilli)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే