Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MP: మద్యం తాగండి..గుట్కా తినండి.. వాటర్‌ ట్యాక్స్‌ మాఫ్‌ చేస్తాం..! బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు దుమారం..

ఈ సందర్బంగా నీటి పన్నును మాఫీ చేస్తామని, వాటర్​ట్యాక్స్​ను తామే కడతామని, కావాల్సితే ఇతర పన్నులను తగ్గించాలని మీరు డిమాండ్​ చేయండి.. అంటూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనం..

BJP MP: మద్యం తాగండి..గుట్కా తినండి.. వాటర్‌ ట్యాక్స్‌ మాఫ్‌ చేస్తాం..! బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు దుమారం..
Janardhan Mishra
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 08, 2022 | 12:47 PM

భారతీయ జనతా పార్టీ ఎంపీ జనార్దన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ఎవరో కాదు..గతంలో మరుగుదొడ్లు శుభ్రం చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని విస్తు పోయేలా చేశాయి. జనార్ధన్‌ మిశ్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నీటిని పొదుపు చేయాలని సూచిస్తూ ఆయన విచిత్రమైన సలహా ఇచ్చారు. నీటిని పొదుపు చేసేందుకు ప్రజలు గుట్కా తినాలని, మద్యం ఎక్కువగా సేవించాలని పిలుపునిచ్చారు. జనార్దన్​ మిశ్రా చేసిన ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

నవంబర్‌ 6న మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలోని కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో నీటి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. నీటి ఎద్దడితో భూములు ఎండిపోతున్నాయని, వాటిని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.. మీరు గుట్కా తినవచ్చు, మద్యం తాగవచ్చు, దుర్వాసనతో కూడిన అయోడిన్ తినవచ్చు, కానీ నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. మీరు ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు. కానీ నీటి పొదుపు విలువను మాత్రం అర్ధం చేసుకోండి,” అని జనార్దన్​ మిశ్రా అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్బంగా నీటి పన్నును మాఫీ చేస్తామని, వాటర్​ట్యాక్స్​ను తామే కడతామని, కావాల్సితే ఇతర పన్నులను తగ్గించాలని మీరు డిమాండ్​ చేయండి.. అంటూ బీజేపీ ఎంపీ జనార్దన్​ మిశ్రా చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.