అంబులెన్స్‌ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది.. మూడేళ్ల కూతురి మృతదేహంతో తండ్రి అవస్థలు.. ఆఖరుకు ఇలా..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Nov 08, 2022 | 12:03 PM

చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో చిన్నారి తండ్రి వెట్టి మల్లయ్య ప్రైవేట్ అంబులెన్సుకు డబ్బులు చెల్లించుకోలేక ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు...ఆ తర్వాత..

అంబులెన్స్‌ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది.. మూడేళ్ల కూతురి మృతదేహంతో తండ్రి అవస్థలు.. ఆఖరుకు ఇలా..
Infant Death

మరో మారు అదే నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సర్కార్‌ లక్ష్యాలకు గండిపడుతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తే.. కొందరు సిబ్బంది అత్యుత్సాహం, నిర్లక్ష్యం కారణంగా పేదలకు అందాల్సిన వైద్యం, సదుపాయాలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. అంబులెన్స్‌ సేవలందించేందుకు ప్రభుత్వ  ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన మూడేళ్ల కుమార్తె మృతదేహాన్ని బైక్‌పై 65 కిలోమీటర్లు తీసుకెళ్లిన హృదయవిదారక ఘటన తెలంగాణలోని ఖమ్మంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కోట మేడేపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ దంపతుల కుమార్తె వెట్టి సుక్కి(3) అనారోగ్యంతో ఏన్కూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తదుపరి చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక చిన్నారి సుక్కీ మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో చిన్నారి తండ్రి వెట్టి మల్లయ్య ప్రైవేట్ అంబులెన్సుకు డబ్బులు చెల్లించుకోలేక ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

Adivasi Family

అనంతరం బాలిక తండ్రి స్వగ్రామానికి వచ్చి బంధువులకు సమాచారం అందించాడు. బాలిక మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రి నుంచి కొత్త మేడేపల్లి గ్రామానికి తరలించాలని అంబులెన్స్‌ను కోరారు. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో గ్రామంలోని బంధువుల నుంచి బైక్‌ తీసుకుని కుమార్తె మృతదేహాన్ని ఎక్కించుకుని వెళ్లారు. సుమారు 65 కి.మీ. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కోట మేడేపల్లి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. జరిగిన ఘటనపై గ్రామస్తులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాలిక కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. కూతురి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాడు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu