Telangana: బాలిక దాతృత్వం..చిన్నప్పటి నుంచి పొదుపు.. పదిహేనళ్ల వయసులోనే విరాళం..

కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో పాటు.. గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాల కోసం కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా నియమించింది. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.1,05,000 విరాళం అందజేసింది ఆ బాలిక. పదేళ్లుగా తన పుట్టినరోజు, వివిధ పండుగల సందర్భంగా..

Telangana: బాలిక దాతృత్వం..చిన్నప్పటి నుంచి పొదుపు.. పదిహేనళ్ల వయసులోనే విరాళం..
10th Student V.Uniki met Collector
Follow us

|

Updated on: Nov 08, 2022 | 12:13 PM

చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకు పొదుపు చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. దీంతో కిడ్డీ బ్యాంకుల్లో తల్లిదండ్రులు, వివిధ సందర్భాల్లో బంధువులు ఇచ్చే డబ్బులను దాచుకుంటారు. ఎంత సేవింగ్స్ చేసినా వెయ్యి, రెండు వేలు అయిన తర్వాత ఏదో అవసరానికి ఉపయోగించడమో. కుటుంబానికి అవసరమైతే ఇవ్వడమో లేకపోతే ఏవైనా బొమ్మలు, వారికి నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తారు. కాని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలిక మాత్రం తాను పదేళ్ల నుంచి పొదుపు చేసిన లక్ష రూపాయల మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ కోసం విరాళంగా అందించింది. కేవలం కంప్యూటర్ ల్యాబ్ కోసం విరాళం ఇవ్వడమే కాదు. దాని నిర్వహణ బాధ్యతలను ఆ చిన్నారి చేపట్టనుంది. అంటే కంప్యూటర్ ఉపాధ్యాయుడికి వేతనం వంటి వాటికి కూడా బాలిక ఏర్పాట్లు చేసింది. ఖమ్మం పట్టణంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వాసిరెడ్డి ఉనికి తన పొదుపు మొత్తాన్ని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు కోసం విరాళంగా అందించింది.

కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో పాటు.. గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాల కోసం కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా నియమించింది. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.1,05,000 విరాళం అందజేసింది ఆ బాలిక. పదేళ్లుగా తన పుట్టినరోజు, వివిధ పండుగల సందర్భంగా తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన డబ్బును పొదుపు చేసి, ఈ మొత్తాన్ని బాలిక అందజేసింది. ల్యాబ్ నిర్వహణ కోసం కంప్యూటర్ టీచర్ ను నియమించి, నెలకు రూ.13 వేలు వేతనం చెల్లించనున్నట్లు ఉనికి తెలిపింది. అంతేకాదు ఉనికి తన తల్లిదండ్రులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కలిసి నవంబర్ 10వ తేదీన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలో కంప్యూటర్ ల్యాబ్‌ ప్రారంభానికి రావాలని ఆహ్వానించింది.

వాసిరెడ్డి ఉనికి తండ్రి శ్రీనివాస్ ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా, తల్లి కృష్ణవేణి ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బాటనీ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఉనికి ఆలోచనకు, దాతృత్వానికి అనేకమంది ఆ బాలికను ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..