AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు.. గుజరాత్, హిమాచల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల బంధాన్ని తెంచుకుని, సొంత పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీని వీడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించాడు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికి ఆ పార్టీ లౌకికవాద విధానానికి తాను..

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు.. గుజరాత్, హిమాచల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Gulam Nabi Azad
Amarnadh Daneti
|

Updated on: Nov 07, 2022 | 10:17 AM

Share

కాంగ్రెస్ పార్టీతో ఎన్నో ఏళ్ల బంధాన్ని తెంచుకుని, సొంత పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీని వీడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించాడు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికి ఆ పార్టీ లౌకికవాద విధానానికి తాను వ్యతిరేకం కాదన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కాంగ్రెస్ మాత్రమే ధీటుగా ఎదుర్కొనగలదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని వదులకున్న రెండు నెలల తర్వాత.. హస్తం పార్టీపట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తాను వ్యతిరేకమని, ఆ పార్టీ లౌకికవాద విధానానికి కాదని చెప్పారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరచాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ సమానదృష్టితో చూస్తూ వస్తోందన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీని ఏమీ చేయలేదని, పంజాబ్‌లో ఆపార్టీ విఫలమైందని ఆజాద్ విమర్శించారు. పంజాబ్ ప్రజలు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయబోరన్నారు.

ప్రధానంగా గులాం నబీ ఆజాద్ ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి చెందిన పార్టీ మాత్రమేనని, పంజాబ్‌ను ఆప్ సమర్థవంతంగా పాలించలేకపోతుందన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ.. తాను ఈ సమస్యపై గతంలో ఎన్నో సార్లు మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే స్వాగతించదగిన చర్యగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్లకు పైగా అనుబంధాన్ని విడిచిపెట్టి ఈ ఏడాది ఆగష్టు 26వ తేదీన ఆజాద్ ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అప్పట్లో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో గులాం నబీ ఆజాద్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సోనియాగాంధీ అధ్యక్షురాలు అయినప్పటికి ఆమె పేరుకే మాత్రమేనని, ఓ కోటరి పార్టీని నడుపుతుందంటూ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోనియాగాంధీకి రాసిన ఐదు పేజీల లేఖలో రాహుల్ గాంధీ పరిపక్వత లేని వ్యక్తి అంటూ విమర్శించిన విషయం తెలిసిందే.

గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఇక్కడ వరుసగా ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా గెలుపు కోసం కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌లో దూకుడుగా వెళ్తోంది. ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రంలో సత్తా చాటితే దేశం దృష్టిని ఆకర్షించవచ్చనే ప్రణాళికతో పాటు.. భవిష్యత్తు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఆలోచనతో గుజరాత్ ఎన్నికలను కేజ్రీవాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..