Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: పిల్లలు నిద్రపోకుండా ప్రశ్నలు వేస్తున్నారా.. వారిని నిద్రపుచ్చేందుకు సింపుల్ గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

మారుతున్న జీవన విధానం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. ఇక దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసే వాళ్లయితే వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్లల ఆలనాపాలన చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు పెద్దలతో..

Parenting Tips: పిల్లలు నిద్రపోకుండా ప్రశ్నలు వేస్తున్నారా.. వారిని నిద్రపుచ్చేందుకు సింపుల్ గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Parenting Tips
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 06, 2022 | 5:30 PM

మారుతున్న జీవన విధానం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. ఇక దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసే వాళ్లయితే వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్లల ఆలనాపాలన చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు పెద్దలతో పాటు పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు నిద్రపోయే సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది పిల్లలు ఆలస్యంగా నిద్రించడానికి ఇష్టపడతున్నారు. దీంతో వారి దినచర్య కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. పిల్లలకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. దీంతో వారి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. రాత్రి సమయానికి నిద్రపోకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ క్రమంలో పిల్లలను నిద్రపుచ్చేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని పాటించడం ద్వారా సమయానికి సులభంగా నిద్రపోయేలా చేయవచ్చు.

పిల్లలు నిద్రించడానికి ముందు గదిలో నిద్ర వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరం. టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఆపేయాలి. ఎక్కువ వెలుతురు ఇచ్చే లైట్లను ఆపివేసి, డిమ్ లైట్‌ను ఆన్ చేయాలి. పిల్లలను నిద్రపోయేలా చేసేందుకు రిలాక్సింగ్ పాటలను కూడా ప్లే చేయవచ్చు. చాలా సార్లు పిల్లలు రోజంతా టీవీ చూస్తూ, స్నాక్స్ తింటారు. అటువంటి పరిస్థితిలో, తక్కువ శారీరక శ్రమ కారణంగా, పిల్లలు త్వరగా నిద్రపోకుండా అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటారు. అందువల్ల పిల్లలను పగటి పూట ఆటలు, వ్యాయామం వంటి శారీరక శ్రమ చేయించాలి. దీనివల్ల పిల్లలు కూడా ఫిట్‌గా ఉంటారు. పిల్లలకు రాత్రి పూట టీ కాఫీలు తాగించవద్దు. ఇది పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఆహారం తిన్న తర్వాత టీ లేదా కాఫీకి బదులుగా పాలు తాగించాలి.

రాత్రి నిద్రపోతున్నప్పుడు పిల్లలు తరచుగా ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు. దీని వల్ల పిల్లలు ఎక్కువ సమయం నిద్రపోరు. అటువంటి పరిస్థితిలో త్వరగా నిద్రపోయేలా పిల్లలతో ప్రార్థన చేయించాలి. దీని వల్ల పిల్లల మైండ్ రిలాక్స్ అవ్వడంతోపాటు, ఆద్యాత్మిక భావన వారిలో కలుగుతుంది. తద్వారా కొద్దిసేపటికే పిల్లలు నిద్రలోకి జారుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..