T20 WORLD CUP: అతడో ఆణిముత్యం.. ఆ క్రికెటర్ బ్యాటింగ్ అత్యద్భుతం.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు..

టీ20 ప్రపంచకప్ భారత్ సెమీఫైనల్స్ చేరిందంటే జట్టు సమిష్టి కృషి కారణం.. ఆటగాడిగా చెప్పుకుంటే విరాట్ కోహ్లీ పేరును తప్పకుండా గుర్తుచేసుకుంటాం. అలాగే కోహ్లీతో పాటు మరో ఆటగాడు కూడా తన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అతడే..

T20 WORLD CUP: అతడో ఆణిముత్యం.. ఆ క్రికెటర్ బ్యాటింగ్ అత్యద్భుతం.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు..
Surya Kumar Yadav, Rahul Dravid
Follow us

|

Updated on: Nov 07, 2022 | 11:47 AM

టీ20 ప్రపంచకప్ భారత్ సెమీఫైనల్స్ చేరిందంటే జట్టు సమిష్టి కృషి కారణం.. ఆటగాడిగా చెప్పుకుంటే విరాట్ కోహ్లీ పేరును తప్పకుండా గుర్తుచేసుకుంటాం. అలాగే కోహ్లీతో పాటు మరో ఆటగాడు కూడా తన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అతడే సూర్యకుమార్ యాదవ్. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. దీంతో అతడి బ్యాటింగ్ ప్రదర్శనపై అనేకమంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య ఆటతీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నాడు రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచ కప్ 2022లో ఇప్పటివరకు 225 పరుగులు చేసి భారత జట్టు తరపున రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. సూర్య ప్రతి గేమ్ లోనూ టీమ్‌కు అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తాడు రాహుల్ ద్రవిడ్. గతం కంటే మరింత మెరుగ్గా ఆడుతున్నాడని, జట్టులో అద్భుతమైన ఆటగాడిగా ఉన్నాడన్నారు.

మంచి ఫామ్ లో ఉన్నాడని, సూర్య కుమార్ యాదవ్ మంచి స్ట్రైక్ రేటుతో ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నాడనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వేపై 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 ప్రపంచకప్‌లో పరుగులతో భారత్ తరపున అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్ 225 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

మంచి స్ట్రైక్ రేట్ తో ఎక్కువ పరుగులు సాధించడం ఏ ఆటగాడికైనా అంత సులభం కాదన్నాడు ద్రవిడ్. సూర్యకుమార్ యాదవ్ ఏ బంతిని ఎలా ఆడాలనేదానిపై స్పష్టతతో ఉంటాడని, తన వ్యూహం తనకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఎంతో కృషి ఫలితంగా సూర్యకుమార్ యాదవ్ నేడు ఈ స్థితిలో ఉన్నాడని ప్రశంసించాడు టీమిండియా కోచ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..