Film to Politics: సినిమాలో సందేశం ఇవ్వాలి.. ఆ వెంటనే జనంలోకి వెళ్లాలి..
నాదేశం సినిమాలో నందమూరి తారక రామారావు ఓ డైలాగ్ చెబుతారు. 'తెలుగుజాతికి తలవొంపులు తెచ్చిన దేశద్రోహులు, ప్రజాదోహులను నాశనం చేస్తానని తెలుగుతల్లికి మాటిచ్చా' అంటారు. ఈ డైలాగ్‌కు సింక్ అయ్యే సీన్.. రియల్ లైఫ్‌లో జరిగింది. అదేంటో చెప్పే ముందు బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ గుర్తు చేసుకోవాలి. 'సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వను' అని ఉంటుందా డైలాగ్. ఆ లైన్ చెప్పడం వెనక ఓ పర్టిక్యులర్ రీజన్ ఉంది. దానికంటే ముందు.. చిరంజీవి కూడా 'గుండె మీద చెయ్ వేశావ్.. తెలియలేదా అక్కడున్న నా పవర్' అని చెబుతారు. థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఇవన్నీ సినిమా డైలాగ్స్‌లా కనిపిస్తాయ్ గానీ.. ఆ రీల్ వెనకున్న రియాలిటీ వేరు. తమ రాజకీయరంగ ప్రవేశానికి ముందు ఏరికోరి రాయించుకున్న డైలాగ్స్ అవి. లేదా.. డైరెక్టర్లే హీరోల ఉద్దేశాన్ని కనిపెట్టి చొప్పించిన డైలాగ్స్ అవి. సరిగ్గా 2024 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్‌తో ఓ డైలాగ్ చెప్పించారు డైరెక్టర్ హరీశ్ శంకర్. 'గ్లాస్ పగిలినకొద్దీ పదునెక్కుతుంది'.. 'గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం' అంటూ ఉస్తాద్ భగత్‌సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సో, మ్యాటర్ ఏంటంటే.. ఇక రాజకీయాల్లోకి వచ్చే టైమ్ వచ్చేసింది అని హీరోలు భావించినప్పుడు.. ఆ విషయాన్ని, తమ ఉద్దేశాన్ని సినిమాల రూపంలో చెప్పారు. సినిమాని తమ రాజకీయ వేదిక కోసం ఉపయోగించుకున్నారు. చివరి సినిమాలో ఓ పవర్‌ఫుల్ మెసేజ్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే.. తమిళస్టార్ విజయ్ ఇదే తన చివరి సినిమా అంటూ ప్రకటించేశారు. పొలిటికల్ ఎంట్రీకి ముందు పక్కా పొలిటికల్ యాంగిల్ ఉన్న సినిమా చేస్తున్నారు. ఒకనాడు ఎంజీఆర్ సైతం ఇదే చేశారు. తెలుగులో ఎన్టీఆర్, పార్టీ పెట్టడానికి ముందు చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చే ముందు బాలకృష్ణ.. అందరూ ఇదే ఫార్ములా ప్రయోగించారు. సో, పాలిటిక్స్‌లోకి వచ్చే ముందు ఎవరెవరు ఎలాంటి సినిమాలు తీశారు, ఆ సబ్జెక్టే ఎందుకు ఎంచుకున్నారు.

‘కాఫీ తాగితే దీర్ఘాయుష్షు.. సర్వే చెప్పిందిదే’ అంటూ పేపర్‌లో ఓ వార్త కనిపిస్తుంది. దానిపై సొసైటీలో ఓ చర్చ జరుగుతుంది. ఆ తరువాత ఓ ప్రముఖ కంపెనీ కాఫీ బ్రాండ్‌ను రిలీజ్ చేస్తుంది. ఇదంతా ఓ స్ట్రాటజీ. ఏదైనా బడా కంపెనీ తన ప్రాడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు.. ఒక ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. అలా తన ప్రాడక్ట్‌కు బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకుంటుంది. ఇదే స్ట్రాటజీని రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న హీరోలు కూడా అప్లై చేశారు. ప్రస్తుత సమాజానికి తమ అవసరం ఏంటో ఆ సినిమాలతో చెప్పారు. ప్రభుత్వ పోకడలు ఎలా ఉన్నాయో, వాటికి పరిష్కారం ఏంటో చెబుతూ సినిమాల్లో చెప్పి రిలీజ్ చేశారు. సినిమాతో తాము కోరుకున్న వాతావరణం క్రియేట్ చేశాక.. అప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పుడు విజయ్ కూడా అదే చేయబోతున్నారు. ‘మధురైయై మీట్ట సుందరపాండియన్’.. ఇది తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం. ఈ సినిమా తరువాతే రాజకీయాల్లోకి వెళ్లారు. ఇక ఆ తరువాత సినిమాలే చేయలేదు. బట్.. పొలిటికల్ ఎంట్రీకి ముందు.. తన ఉద్దేశం ఏంటో ఆ సినిమాలో చెప్పేశారు. క్రూరమైన రాజుల పరిపాలనలో ఉన్న మధురై రాజ్యానికి విముక్తి కల్పిస్తాడు ఆ సినిమాలో. ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కల్పిస్తాడు. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే సబ్జెక్ట్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే.. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి తమిళనాట ఎలాంటి పరిస్థితి ఉందనేది పరోక్షంగా...
