JEE Advanced 2026 Notification: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పరీక్ష సిలబస్, హెడ్యూల్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వెల్లడైంది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్‌తోపాటు, సిలబస్‌ను కూడా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. జేఈఈ మెయిన్స్‌లో కనీస ర్యాంకులు సాధించిన తొలి 2.50 లక్షల అభ్యర్ధులు మాత్రమే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2026 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఏఏటీ-2026 జూన్ 04వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఇందులో ర్యాంకు సాధించిన వారికి ఐఐటీల్లోని బీఆర్క్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఏఏటీ ఫలితాలు జూన్ 7, 2026వ తేదీన వెల్లడిస్తారు. మరోవైపు బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు, 2026.
- ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: మే 4, 2026.
- అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్: మే 11 నుంచి 17 వరకు
- జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష నిర్వహణ తేదీ: మే 17, 2026.
- ప్రిలిమినరీ కీ విడుదల తేదీ: మే 25
- కీపై అభ్యంతరాల నమోదు తేదీలు: మే 25 నుంచి మే 26 వరకు
- ఫలితాల వెల్లడి తేదీ: జూన్ 1, 2026.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




