ఇండియా టూర్‌కు వచ్చిన విదేశీ యువతికి ఢిల్లీలో చేదు అనుభవం.. స్టేషన్‌లోకి వెళ్తుండగా..
దేశంలో రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. స్వేదేశీయులనే కాకుండే.. విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులను సైతం కొందరు కేటుగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒంటరిగా ఇండియా ట్రిప్‌కు వచ్చిన ఓ పోలాండ్ యువతిని.. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనకు సంబంధించిన విషయనాన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండియాను విజిట్ చేందుకు వచ్చిన కాంటెట్ క్రియేటరైన పోలాండ్ యువతికి దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని పరిణామం ఎదురైంది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తనను ఓ వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక పోస్ట్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. తన 8 గంటల రైలు ప్రయాణంలో ఢిల్లీ చేరుకున్న ఆమె అక్కడి నుంచి వారణాసికి వెళ్లేందుకు ఉబర్‌లో ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్టు పేర్కొంది. అయితే, ఆమె స్టేషన్‌లోకి వెళ్లేప్పుడు.. ఎంట్రెన్స్ దగ్గర ఓ వ్యక్తి ఆమెను అడ్డుకొని.. ట్రైన్ టికెట్ చూపించాలని కోరినట్టు ఆమె తెలిపింది. అయితే ఆమె తన దగ్గర ఉన్న టికెట్ చూపించినప్పుడు.. అతను ఆ టికెట్ నకిలీదని.. అది చెల్లదని ఆమెకు చెప్పాడు.
View this post on Instagram
తన సమస్య పరిష్కారం కావాలంటే.. సమీపంలో ఉన్న ఆఫీస్ దగ్గరకు రావాలని అతను చెప్పినట్టు ఆమె పేర్కొంది. దాన్ని బట్టి అతను తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తాను ఆర్థం చేసుకున్నానని ఆమె రాసుకొచ్చింది. సుమారు 10 నిమిషాల పాటు అతనితో వాధించిన యువతి.. తన దగ్గర ఉన్న టికెట్స్ సరిగ్గానే ఉన్నాయని.. పాత కొన్ని టికెట్స్ కూడా చూపించడంతో అతను తనను వదిలేసినట్టు ఆమె పేర్కొంది.
అయితే 10 నిమిషాల్లో బయల్దేరేందుకు స్టేషన్‌లో ట్రైన్ సిద్దంగా ఉన్నందున.. తాను ఇంత టెన్షన్ పడినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అయితే తాను ప్లాట్‌ఫాంలోకి వెళ్లే సరికే అక్కడి రైలు కదిలిందని.. సమయానికి హిందీ మాట్లాడే ఒక వ్యక్తి తనుకు సహాయం చేయడంతో చివరకు ట్రైన్ ఎక్కగలిగానని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
