BSNL: న్యూయర్ వేళ BSNL నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏంటో తెలుసా?
BSNL Wi-Fi Calling service: నూతన సంవత్సరం వేళ తమ కస్టమర్లకు BSNL గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్ సేవలనను అందుబాబులోకి తీసుకొచ్చింది. ఈ సేవ BSNL కస్టమర్లకు ఇప్పుడు అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ వైఫై కాలింగ్‌తో నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ స్పష్టమైన, అధిక నాణ్యత కలిగిన కాల్స్ చేసుకోవచ్చు.

నూతన సంవత్సరం మొదటి రోజున BSNL వాయిస్ ఓవర్ వైఫై (వీఓడబ్ల్యూఐఎఫ్ఐ) సేవలను దేశమంతటా అందుబాటులోకి తీసుకువచ్చింది. వై-ఫై కాలింగ్ గా పిలిచే ఈ సేవ ఇక దేశంలో అన్ని టెలికం సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో నెట్ వర్క్ సవాళ్లు ఎదురయ్యే ప్రాంతాల్లో కూడా అధిక నాణ్యత కలిగిన మొబైల్ వైఫై కాలింగ్ సేవలు వినియోగదారులు పొందనున్నారు.
దేశంలోని అన్ని టెలికం సర్కిల్లలో BSNL కస్టమర్లకు వైఫై కాలింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వై-ఫై నెట్‌వర్క్‌లో వాయిస్ కాల్స్ చేయడానికీ, వైఫై కాల్స్ పొందడానికి సంక్షిప్త సమాచారాన్ని పంపించడానికి వైఫై కాలింగ్ సేవలు ఉపయోగపడతాయి. ఇళ్లు, ఆఫీసులు, బేస్‌మెంట్లు, మారుమూల ప్రాంతాలు ఇలా మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉండే ఏ ప్రాంతాల్లో మీరు ఉన్నా స్పష్టమైన కనెక్టివిటీ మీకు అందుతుంది. దీని వల్ల ప్రజలు ఎక్కడున్నా.. టెన్షన్ లేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. నెట్‌వర్క్ సమస్య అనేది ఉండదు.
వైఫై అనేది IMS ఆధారిత సేవ. ఇది వై-ఫైకీ, మొబైల్ నెట్‌వర్కులకీ మధ్య ఇబ్బందులనూ ఎదుర్కోకుండానే మార్పిళ్లకు అనువుగా ఉంటుంది. ఇందులో థర్డ్ పార్టీ సేవల్ని పొందాల్సిన అవసరం లేకుండానే వినియోగదారుడు మొబైల్ నంబర్, ఫోన్ డయలరునూ ద్వారా కాల్స్ చేయొచ్చు. ఈ సేవ ముఖ్యంగా మొబైల్ సేవల లభ్యత పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ వైఫై కాలింగ్ సేవలు BSNL నెట్‌వర్క్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపెనీ వై-ఫై కాల్స్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు తీసుకోవట్లేదు. BSNL నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడం, మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో ఈ వైఫై కాలింగ్‌ను ప్రవేశపెట్టినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
