నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అంతర్వేదిలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి వచ్చిన యువకులు బీచ్ వద్ద పార్టీ చేసుకుని అర్ధరాత్రి జీప్లో ప్రయాణిస్తుండగా, వాహనం అదుపుతప్పి గోదావరి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గోపికృష్ణ బయటపడగా, శ్రీధర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.