తెలుగులో డ్రాగన్ బ్యూటీ డిమాండ్.. ఇప్పట్లో జోరు ఆగడం కష్టమే..
Rajitha Chanti
Pic credit - Instagram
కామన్ గా సినీరంగంలో కొందరు హీరోయిన్ల కెరీర్ ఒక్క సినిమాతోనే మలుపు తిరుగుతుంది. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన తారలలో కయాదు లోహర్ ఒకరు.
ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ సినిమాతో ఈ అమ్మడు లైఫ్ టర్న్ అయ్యింది. అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.
ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తూన్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.
అంతకు ముందు శ్రీవిష్ణు సరసన అల్లూరి చిత్రంలో నటించినప్పటికీ అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ డ్రాగన్ సినిమాతో సౌత్ అడియన్స్ దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ.
ఇప్పుడు ఆమె నటిస్తున్న ఫంకీ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయట. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలకు సైన్ చేసిందని టాక్.
విశ్వక్ సేన్ ఫంకీ సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడు బిజీ అవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది. యువ హీరోల సినిమాల్లో ఈ ముద్దుగుమ్మకు ఛాన్సులు వస్తున్నాయట.
మొత్తానికి ఈ కొత్త ఏడాది కయాదు లోహర్ కు కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఫంకీ సినిమాతోపాటు తెలుగులో యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న కయాదు.. అటు నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను అల్లాడిస్తుంది ఈ డ్రాగన్ ముద్దుగుమ్మ.