01 January 2026

ఫిట్నెస్, అందం కోసం శ్రీలీల ఏం చేసే పని అదేనట.. ఏం చెప్పిందంటే.

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం హీరోహీరోయిన్స్ అందరూ ఫిట్‌నెస్ పై మరింత ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందమైన శరీరాకృతి కోసం జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తుంటారు.

అలాగే తమ డైట్, వర్కవుట్ కు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల సైతం తన ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసింది.

తెలుగులో ఈ అమ్మడు బ్యా్క్ టూ బ్యాక్ అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ ఆమె సోషల్ మీడియాలో ఒక్క వర్కవుట్ వీడియో కూడా షేర్ చేయలేదు.

ఈ అమ్మడు అంత అందంగా, గ్లామర్ గా కనిపించడానికి కారణం యోగా అని చెబుతుంది. సూర్య నమస్కారం వంటి చిన్న చిన్న ప్రక్రియలతో యోగా స్టార్ట్ చేస్తుందట.

చిన్న చిన్న ప్రక్రియలతో యోగా చేయడం స్టార్ట్ చేస్తే అది మన జీవితంలో భాగమవుతుందని తెలిపింది. తనకు జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేయడం ఇష్టముండదట.

కేవలం రోజూ యోగా చేస్తానని.. ప్రతిరోజూ విభిన్నమైన యోగాసనాలు చేయడం వల్ల బాడీలో ఒక రకమైన ఇంజనీరింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకొచ్చింది శ్రీలీల.

తన జీవితంలో క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు ఆలోచన విధానం సైతం మారుతుందని.. బాడీ ఫిట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో వరుసగా మరిన్ని అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.