New Year Tragedy: న్యూ ఇయర్ వేళ ఘోర అగ్నిప్రమాదం.. దగ్ధమైన 150 ఏళ్ల నాటి చర్చి!
న్యూ ఇయర్ వేళ నెదర్లాండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లోని 1880లో నిర్మితమైన 150 ఏళ్ల చరిత్ర గల వొండెల్కర్క్ చర్చి మంటల్లో కాలిపోయింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, రంగంలోకి దిగి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. మంటలు పక్కనున్న ఇళ్లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయిన వేళ నెదర్లాండ్స్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశంలోని సెంట్రల్ అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న చారిత్రక వాండల్కర్క్ చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకుంటుండగా 1880లో నిర్మితమైన క్యాథలిక్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడున్న 50 మీటర్ల ఎత్తైన చర్చి టవర్ కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటలనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే మంటలన అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు పక్కనున్న ఇళ్లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ప్రాణనష్ణాన్ని నివారించేందుకు చర్చి చుట్టుపక్కల ఉన్న 90 నివాస గృహాలను ఖాళీ చేయించారు అధికారులు. ఈ ప్రమాదంలో చుట్టు పక్కల మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాద ఘటనపై స్థానిక అధికారులు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం లేదని స్పష్టం చేశారు. ప్రమాదంలో చర్చి పూర్తిగా దగ్ధమైపోయిందని.. ఈ భవనం పునర్వినియోగానికి పనికిరానిదిగా తెలిపారు. అయితే ప్రమాదానికి గలపై కారణాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఉపయోగించిన బాణాసంచా (ఫైర్ వర్క్స్) కారణంగానే అగ్నిప్రమాదానికి సంభవించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
