Foreign Job: శనీశ్వరుడితో చంద్రుడు.. ఆ రాశుల వారికి విదేశీ ఉద్యోగ యోగం..!
Foreign Job Horoscope: ఈ నెల(జనవరి) 23, 24, 25 తేదీల్లో చంద్రుడు ఆధ్యాత్మికతకు, విదేశీయానానికి సంబంధించిన మీన రాశిలో శనీశ్వరుడితో కలిసి ఉండడం జరుగుతోంది. దీనివల్ల అటు విదేశీ ప్రయత్నాల్లోనూ, ఇటు ఆధ్యాత్మిక సాధనలోనూ కార్యసిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఈ మూడు రోజుల్లో ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేపట్టినా అది తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తుంది. ఆ రోజుల్లో ఉద్యోగానికి, విదేశీయానానికి, విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నాలు సాగించినా, దరఖాస్తులు పెట్టుకున్నా తప్పకుండా శుభ వార్తలు వింటారు. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6