రాజస్థాన్ ఎడారి ప్రాంతం సికర్ జిల్లాలోని బేరి గ్రామానికి చెందిన సంతోష్ దేవి, బీడు భూములను సారవంతంగా మార్చి దానిమ్మ, ఆపిల్ పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించింది. పదేళ్ల పాటు సాగిన ఆమె కృషి ఫలించి, సాగుకు అననుకూలమైన నేలలో అద్భుతాలు సృష్టించింది. ఈ అరుదైన విజయానికి గాను ఆమెకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం లభించింది.