AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

టాటా టియాగో సీఎన్‌జీ ఆటోమేటిక్.. మధ్యతరగతి కుటుంబాల కలల కారు. తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర్లు, అధిక మైలేజీ అందిస్తూ, సిటీ డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. సీఎన్‌జీ విభాగంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన తొలి కారు ఇది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌
Tata Tiago Cng Amt
SN Pasha
|

Updated on: Jan 22, 2026 | 10:07 PM

Share

మధ్యతరగతి కుటుంబాలంటేనే బడ్జెట్‌తో కుస్తీ పడుతూ ఉంటాయి. ప్రతి పనికి బడ్జెట్‌ వేసుకొని దానికి తగ్గట్లే అన్నీ ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. కారు కొనడం అంటే వారికి ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకత కలిగిన కారు.. వారికి బడ్జెట్‌ ధరలో లభిస్తే, అది కూడా అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ ధరలో అన్నింటికీ మించి టాటా బ్రాండ్‌తో వస్తున్న కారు ఒకటి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మిడిల్‌ క్లాస్‌ కలల కారు అని చెప్పొచ్చు. వాళ్లు కోరుకునే ప్రతి అంశం అందులో ఉంటుంది. ఇంతకీ ఆ కార్‌ ఏదో దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారం తగ్గించడంతో పాటు, సిటీ ట్రాఫిక్‎లో డ్రైవింగ్ ఈజీ చేసే విధంగా ఓ అద్భుతమైన కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది అదే టాటా టియాగో సీఎన్జీ ఆటోమేటిక్. మన దేశంలో అత్యంత చౌకైన, సీఎన్జీ విభాగంలో ఆటోమేటిక్ గేర్‎బాక్స్‌తో వచ్చినటువంటి మొదటి ఇదే కావడం విశేషం. టాటా టియాగో తన సెగ్మెంట్‌లో దీంతో ఓ విప్లవాన్నే సృష్టించిందని చెప్పాలి. సాధారణంగా సీఎన్జీ కార్లు అంటే కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే వస్తాయనే సంప్రదాయాన్ని చెరిపేస్తూ, టాటా కంపెనీ ఏఎంటీ(AMT) టెక్నాలజీని ఇందులో ఇంట్రడ్యూస్ చేసింది. దీని బేసిక్ మోడల్ ధర కూడా కేవలం రూ.7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్)మాత్రమే.

బాగా రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మారుస్తూ ఇబ్బంది పడేవారికి, అలాగే తక్కువ ఇంధన ఖర్చుతో రోజూ ఆఫీసులకు వెళ్లాలని అనుకునే వాళ్లకు ఈ కారు బెస్ట్ ఆప్షన్. ఇక ఈ కారు ఇంజిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ కారులో 1.2 లీటర్ల రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది సిఎన్‌జి మోడ్‌లో 73 bhp పవర్, 95 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఉన్న 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా వర్క్ చేస్తుంది. టాటా టియాగో సీఎన్జీ ఆటోమేటిక్ వేరియంట్ ఏకంగా కిలోకు 28.06కిమీ మైలేజీని అందిస్తుందని ఏఆర్ఏఐ (ARAI) కన్ఫాం చేసింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్జీతో ప్రయాణించడం వల్ల వాహన యజమానుల జేబుకు 50 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది.

ఇక ఫీచర్ల పరంగా చూస్తే కూడా ఈ కారు ఎక్కడా తగ్గలేదు. కారు లోపల పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మన్ బ్రాండ్ కి చెందిన 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో అందించారు. అంతేకాకుండా కూల్డ్ గ్లోవ్ బాక్స్, వాయిస్ కమాండ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. అంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కారు కండీషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. టాటా కారు అంటేనే సేఫ్టీకి మారుపేరు. టియాగో కారు గ్లోబల్ ఎన్‎క్యాప్(Global NCAP) క్రాష్ టెస్టులో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్(ABS) విత్ ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి