ఒక్క సినిమా చేయకుండానే తెలుగులో సెన్సేషన్.. గ్లామర్ క్వీన్ అరాచకం..

Rajitha Chanti

Pic credit - Instagram

22 January 2026

తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి.

తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా పరిచయమైన బ్యాచిలర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకుంది. 

బ్యాచిలర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన దివ్య భారతి.. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించి కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. 

ఇప్పుడు తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైనప్పటికీ సినిమా మాత్రం ఇంకా విడుదల కాలేదు.

కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పొట్టి డ్రెస్ లో ఫారెన్ వీధుల్లో సందడి చేసింది దివ్యభారతి. 

తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేయడం ఖాయమని తెలుస్తోంది.