ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో సపోటా పండు చాలా ముఖ్యమైనది. ఈ పండు రుచికి తియ్యగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు
TV9 Telugu
సపోటా పండులో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు దండిగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ, క్యాల్షియం,ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి
TV9 Telugu
సపోటాలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి
TV9 Telugu
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సపోటా మనకు ఎంతో దోహదపడుతుంది. సపోటా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సపోటా పండ్లను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసటను తగ్గించి శక్తిని ఇవ్వడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి
TV9 Telugu
తరచూ అలసట, బలహీనతతో బాధపడే వారు సపోటాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సపోటాలో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది
TV9 Telugu
అయితే సపోటా మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ డయాబెటిస్ తో బాధపడే వారు దీనిని తినకపోవడమే మంచిది. దీనిలో లేటెక్స్, టానిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి
TV9 Telugu
అందుకే డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఊబకాయం, గుండె జబ్బులు ఉన్న వారు కూడా దీనిని వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది