జిమ్‏కు వెళ్లినా తగ్గలేదు.. డేటింగ్ వల్ల బరువు తగ్గానంటున్న హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

22 January 2026

సాధారణంగా హీరోయిన్ అంటే ఫిట్నెస్ పై ఎంత శ్రద్ధగా ఉంటారో చెప్పక్కర్లేదు. లుక్స్ తోపాటు శరీరాకృతి సైతం ముఖ్యమే అన్న సంగతి తెలిసిందే. 

అందుకే సెలబ్రెటీస్ నిత్యం జిమ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతుంటారు. అలాగే కఠినమైన డైట్ ఫాలో కావడం.. యోగా చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటారు.

కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్ కు వెళ్లడం వల్ల బరువు తగ్గలేదని.. అసలు రెండేళ్లుగా జిమ్ ముఖమే చూడలేదని అసలు విషయం చెప్పేసింది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రాశీ ఖన్నా. తాను సన్నబడటానికి డేటింగ్ ఎంతో సహయపడిందని తెలిపింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

గతంలో తాను బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశానని గంటల తరబడి వర్కవుట్స్ చేశానని తిలిపింది. కానీ తనకు ఎలాంటి ఫలితం కనిపించలేదని అంటుంది.

రెండేళ్లపాటు ఎలాంటి వ్యాయమాలు చేయలేదని.. కాను తను బరువు తగ్గినట్లు తెలిపింది. ముఖ్యంగా డేటింగ్ మానసిక ప్రశాంతత ఇచ్చిందని అంటుంది.

ఆ సంతోషమే తన శరీర మెటబాలిజంను మెరుగుపరిచిందని.. డేటింగ్ అంటే కేవలం తిరగడం మాత్రమే కాదని.. మానసిక ప్రశాంతత ఇచ్చిందని తెలిపింది.

 ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం వల్ల తనలోని స్ట్రెస్ లెవల్స్ తగ్గిపోయాయని.. దీంతో తాను సహజంగానే బరువు తగ్గానని అంటుంది రాశీ ఖన్నా.