Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు దీనికి కారణం. అయితే, ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై రూ.2,290, కిలో వెండిపై రూ.5,000 వరకు పడిపోయాయి. బంగారం కొనుగోలుకు ఇది సరైన సమయం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త ఏడాది మొదటి నెలలోనే బంగారం ధరలు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. బుధవారం ఒక్క రోజే 10 గ్రాముల బంగారంపై ఐదు వేలకు పైగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు లబోదిబోమంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అని చెప్పవచ్చు.. యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు సుంకాల బెదిరింపులతో ధరలు నింగిని తాకాయి. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. జనవరి 22 గురువారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,290 తగ్గి రూ.1,54,310 లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 2,100 లు తగ్గి రూ.1,41,450 లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.5000 లు తగ్గి రూ.3,40,000లు పలుకుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,54,460 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,600 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,310 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,450 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,910 లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,42,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,310 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,450గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,310 ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,40,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ఇండియాలో నెంబర్ 1 స్టార్ మనోడే !!
Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది
CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

