AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

Phani CH
|

Updated on: Jan 22, 2026 | 7:37 PM

Share

"సికిందర్" సినిమా డిజాస్టర్ తర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ మధ్య మొదలైన బ్లేమ్ గేమ్ ఇప్పుడు రష్మిక కామెంట్స్‌తో మళ్ళీ చర్చకు వచ్చింది. కథ మారడం వల్లే సినిమా ఫలితం మారిందని రష్మిక చెప్పగా, సల్మాన్ ఫ్యాన్స్ మురుగదాస్‌పై విరుచుకుపడుతున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టాలని సూచిస్తూ, ఈ వైఫల్యానికి కారణం మురుగదాసే అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఇది నార్త్ వర్సెస్ సౌత్ వివాదాన్ని కూడా రాజేస్తోంది.

ఓ సినిమా హిట్టైతే కొన్ని రోజులు వార్తల్లో ఉంటుంది. అదే ఓ సినిమా డిజాస్టర్ వార్తల్లో కనిపించకుండా పోతుంది. కానీ సికింధర్ మూవీ మాత్రం.. డిజాస్టర్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ మూవీ రిజెల్ట్‌ విషయంలో మురగదాస్, సల్మాన్ ఒకరినొకరు విమర్శించుకోవడం కారణంగా.. ఈ మూవీ నేమ్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ వైఫల్యానికి కారణం ఎవరనే చర్చ అప్పట్లో గట్టిగా నడిచింది. నార్త్‌ వర్సెస్‌ సౌత్‌గా.. చిన్న పాటి యుద్ధానికి కూడా దారితీసింది. సల్మాన్ ఫ్యాన్స్.. మురుగదాస్ ఫ్యాన్స్‌ మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మనేంత పరిస్థితికి తెచ్చింది. అయితే ఈ మధ్య కాస్త సైడ్ అయిపోయినట్టు కనిపించిన ఈ టాపిక్… రష్మిక లేటెస్ట్ కామెంట్స్ కారణంగా నెట్టింట మరో సారి పైకి వచ్చింది. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్‌గా.. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. రీసెంట్ గా ఓ పాడ్ క్యాస్ట్ షోకు వెళ్లింది. అక్కడ సికింధర్ మూవీ గురించి నోరు విప్పింది. సికందర్‌ కథ తనకు చెప్పినప్పుడు ఒకలా ఉందని.. ఆ తర్వాత మొత్తం మారిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు సాధారణంగా ఇలాగే చాలా సినిమాల్లో జరుగుతూనే ఉంటుందన్న రష్మిక.. దర్శలకు కొందరు మొదట కథ ఒకటి చెప్తారని.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్‌, రిలీజ్‌ డేట్‌, ఎడిటింగ్‌.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతాయంటూ చెప్పుకొచ్చింది. సికందర్‌ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది. అయితే రష్మిక స్టేట్మెంట్‌ను పట్టుకున్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో డైరెక్టర్ మురుగదాస్‌ పై సీరియస్ అవుతున్నారు. తన దగ్గర తప్పు పెట్టుకుని.. తమ హీరో షూటింగ్‌కు టైంకు రాలేదని.. రాత్రుళ్లు మాత్రమే షూటింగ్ చేయడంతో… సినిమా ఎఫెక్ట్ అయినట్టు మురుగదాస్‌ చెప్పడాన్ని వారు తప్పుబడుతున్నారు. కంప్లైట్ మానేసి.. ఫ్యూచర్లో అయినా బౌండెడ్‌ స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాలంటూ మురుగదాస్‌కు సూచిస్తున్నారు. రష్మిక మాటలతో ఎవరిది తప్పో తేలిపోయిందంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్

‘నా ఫోటోలు జూమ్‌ చేసి చూశారు’ హీరోయిన్ ఎమోషనల్

కోహ్లి తాగిన ఆ డ్రింక్‌ ఖరీదెంతో తెలిస్తే మైండ్ బ్లాక్‌

ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ రియాక్షన్

గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు