AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు

గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు

Phani CH
|

Updated on: Jan 22, 2026 | 5:41 PM

Share

భారత్‌లో గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణంగా మారాయి, ప్రతి ఐదు మరణాల్లో రెండు గుండె సంబంధితమే. యువతలో గుండెపోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యకర జీవనశైలి, జంక్ ఫుడ్, వ్యాయామ లోపం, బీపీ, షుగర్ వంటివి ముఖ్య కారణాలు. సకాలంలో గుండె పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌లో గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట మోగిస్తున్నాయి. ప్రతి ఐదు సర్టిఫైడ్ మరణాల్లో రెండు… గుండెపోటు లేదా ఇతర హృద్రోగాల వల్లే జరుగుతున్నాయన్న అధికారిక డేటా దేశాన్ని కలవరపెడుతోంది. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్‌ ఎటాక్‌తో నేలకొరుగుతున్నారు. కార్డియక్‌ ఫెయిల్యూర్లతో అర్థాంతరంగా ఆయుష్షు ముగియడానికి అసలు కారణాలేంటి… ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు…? ఇప్పుడివే ప్రశ్నలు సగటు భారతీయులను తొలిచేస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధులు… ఇప్పుడు భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణంగా మారాయి. తాజా Cause of Death Report – 2021 నుంచి 2023 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం సర్టిఫైడ్ మరణాల్లో సుమారు 31 నుంచి 35 శాతం వరకు గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయి. అంటే… నమోదైన ప్రతి 5 మరణాల్లో సుమారు 2 మరణాలకు హార్ట్ అటాక్ లేదా ఇతర హృద్రోగాలే కారణంగా తెలుస్తోంది. 2007–2013 మధ్య కాలంతో పోలిస్తే గుండె జబ్బుల వల్ల మరణాల శాతం దాదాపు 10 శాతం వరకు పెరిగింది. ఇక మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం…ఏమిటంటే యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతుండటం. అనారోగ్యకర జీవనశైలి, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణ లోపం, పొగతాగడం, మద్యం సేవనం, ఇవన్నీ హార్ట్ అటాక్ రిస్క్‌ను తీవ్రంగా పెంచుతున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది వృద్ధుల సమస్య మాత్రమే కాదు. 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి అయినా గుండె పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో గుర్తిస్తే… హార్ట్ అటాక్ వల్ల జరిగే మరణాలను చాలా వరకు నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్‌ అప్డేట్‌..! వీడియో రిలీజ్‌ చేసిన అశ్విని వైష్ణవ్

అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్‌

Pooja Hegde: మాస్ పల్స్ తెలిసిందన్న పూజాహెగ్డే.. ఇక దుమ్ము దుమారమే

గ్లామర్ డోస్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఫ్యాన్స్ కోసం తప్పదు బాస్ అంటున్న ముద్దుగుమ్మ