AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్‌

Phani CH
|

Updated on: Jan 22, 2026 | 5:31 PM

Share

గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీకాంత్ ద్వివివాహ మోసం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిళ్లు చేసుకుని, కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు. మొదటి భార్యను గర్భంతో ఉండగా వదిలేసి, రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండానే మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో బాధితులు గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో శ్రీకాంత్‌ బండారం బట్టబయలు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చేసేది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం.. ఏం చేసినా.. ఎన్ని వేషాలేసినా అంతా సాఫ్ట్‌గా సాగిపోతుందనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముచ్చటగా మూడో మహిళకు మూడుముళ్లు వేయడానికి రెడీ అయిపోయాడు. ఇద్దరు భార్యలు పోలీసుల స్టేషన్‌ మెట్లెక్కడంతో బండారం బయటపడింది. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ కు బంధువైన రేపల్లెకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. వీరి ప్రేమ విషయాన్ని పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించిన వీరిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. కొద్దీ రోజులకు పెద్దలు కూడా అంగీకరించి కట్న కానుకలు కూడా భారీగానే అందించారు. కొద్దీ రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పుట్టింటికి వెళ్లింది. ఆ మహిళ బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాపురానికి తీసుకెళ్లకుండా అదనపు కట్నం కావాలని పేచీపెట్టాడు. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో ఉండగానే శ్రీకాంత్ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా మరొక సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. 2023లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో రెండో పెళ్ళివారు కూడా కట్నకానుకలు అందించారు. ఆమె కూడా గర్భం దాల్చిన తర్వాత ఆమెను శ్రీకాంత్ పుట్టింటి వద్ద దించి వెళ్లాడు. వీరికి బాబు పుట్టాడు. శ్రీకాంత్ కు అంతకముందే పెళ్లైందని, ఆమెకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న ఖమ్మం యువతి శ్రీకాంత్ ను నిలదీసింది. అప్పటి నుండి శ్రీకాంత్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. గట్టిగా ప్రశ్నిస్తే అసలు పెళ్లే చేసుకోలేదని సహజీవనం మాత్రమే చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు భార్యలు ఒకరి తర్వాత మరొకరు శ్రీకాంత్ ను ప్రశ్నిస్తుండటంతో వారికి చెక్ పెట్టేందుకు మూడో వివాహం చేసుకోబోతున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు బయట పెట్టాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని తమ జీవితాలను నాశనం చేసిన శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pooja Hegde: మాస్ పల్స్ తెలిసిందన్న పూజాహెగ్డే.. ఇక దుమ్ము దుమారమే

గ్లామర్ డోస్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఫ్యాన్స్ కోసం తప్పదు బాస్ అంటున్న ముద్దుగుమ్మ

Aamir Khan: డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆమిర్ ఖాన్ కామెంట్‌.. అబ్బా ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

Rashmika Mandanna: ఎవరు ఏమైనా అనుకోని.. నా దారి రహదారి అంటున్న రష్మిక మందన్న

సమ్మర్ బరిలో మెగా హీరోల జోరు.. వరుసగా నాలుగు సినిమాలు