అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
నెల్లూరు చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో సోమవారం నాగుపాము దర్శనమివ్వడం భక్తులకు దైవ మహిమగా తోచింది. కార్తీక మాసంలో ఈ అద్భుతం జరగడంతో, శివుడికి ప్రీతికరమైన నాగరాజు దర్శనం శుభ సూచకమని భక్తులు విశ్వసించారు. వందలాది మంది భక్తులు స్వామి నామస్మరణ చేయగా, ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అందులోనూ శివుడికి ముఖ్యమైన సోమవారం నాడు ఆ ఆలయంలో ఉంటున్న నాగేంద్రుడు దర్శనం ఇస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. ఇటీవల కార్తీక మాసంలో కూడా పలు సందర్భాల్లో ఆలయంలో నాగరాజు కనబడడంతో ఆ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు కార్యకర్తగా మహిమ అని నమ్ముతూ ప్రదక్షిణలు చేస్తుంటారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. శివుడికి ఎంతో ప్రీయమైన సోమవారం రోజున ఆలయంలో నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది.. ఆలయానికి వచ్చిన భక్తులు నాగుపామును చూసి పూజలు చేసిన కాసేపటికి తిరిగి పుట్టలోకి వెళ్లిపోయిందని, ఆలయానికి వచ్చిన భక్తులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు.. సోమవారం సందర్భంగా కొందరు భక్తులు విశేష పంచామృత రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనానికై వచ్చిన సమయంలోనే నాగేంద్రుడు విశ్వనాథ స్వామి వారిపై దర్శనమివ్వడంతో వందలాదిగా వచ్చిన భక్తులు పరవశించి పోయారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణలతో మార్మోగిపోయింది. ఆలయ అర్చకులు శ్రీనివాసులు అక్కడ ఉన్న భక్తులు ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్
Pooja Hegde: మాస్ పల్స్ తెలిసిందన్న పూజాహెగ్డే.. ఇక దుమ్ము దుమారమే
గ్లామర్ డోస్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఫ్యాన్స్ కోసం తప్పదు బాస్ అంటున్న ముద్దుగుమ్మ
Aamir Khan: డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఆమిర్ ఖాన్ కామెంట్.. అబ్బా ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
Rashmika Mandanna: ఎవరు ఏమైనా అనుకోని.. నా దారి రహదారి అంటున్న రష్మిక మందన్న
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

