ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ రియాక్షన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించింది, భద్రతా కారణాలతో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఐసీసీ దీనికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో, జనవరి 21 డెడ్‌లైన్ విధించిందని వస్తున్న వార్తలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఖండించింది. ఐసీసీతో చర్చలు కొనసాగుతున్నాయని, ఎలాంటి గడువు ఇవ్వలేదని బీసీబీ స్పష్టం చేసింది.
మరో మూడు వారాల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. అయితే భారత్‌లో ఆడేది లేదని మొండిపట్టు పట్టిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు ప్రచారం జరగుతోంది. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడతారా లేదా అనేది జనవరి 21 లోగా చెప్పాలని ఐసీసీ గడువు విధించింది అనేది ఆ ప్రచారం సారాంశం. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లా డిమాండ్ చేస్తుండగా అందుకు ఐసీసీ ససేమిరా ఒప్పుకోవడం లేదు. కానీ బంగ్లాదేశ్ మాత్రం తమ గౌరవాన్ని తాకట్టుపెట్టి భారత్‌లో ఆడబోమని ఇప్పటికే ఐసీసీకి తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఐసీసీ అల్టిమేటం వార్తలపై ఆ దేశ క్రికెట్‌బోర్డు స్పందించింది. భారత్‌లో టీ – 20 వరల్డ్ కప్ ఆడే విషయంలో ఐసీసీ తమకు ఎలాంటి డెడ్‌లైన్ లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టత ఇచ్చింది. జనవరి 21 లోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ చెప్పిందన్న వార్తలను బీసీబీ ఖండించింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై వేదికలుగా ఉన్న ప్రస్తుత షెడ్యూల్‌ను మార్చేది లేదని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై ధాకాలో జరిగిన చర్చల సందర్భంగా జనవరి 21 తుది గడువుగా పేర్కొన్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అయితే బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అమ్జద్ హొసైన్ మీడియా కథనాలను పూర్తిగా తిరస్కరించాడు. “జనవరి 17న ఐసీసీ ప్రతినిధులు ఢాకాకు వచ్చారు. మా బోర్డు సభ్యులతో సమావేశం జరిగింది. వరల్డ్ కప్ వేదిక విషయంలో మా అభ్యంతరాన్ని వాళ్లకు స్పష్టంగా తెలియజేశాం. ప్రత్యామ్నాయ వేదిక ఇవ్వాలని కోరాం. ఈ చర్చల్లో ఎక్కడా ప్రత్యేక తేదీ లేదా డెడ్‌లైన్ గురించి వారు చెప్పలేదు” అని ఆయన వెల్లడించాడు. “మా ఆందోళనలను ఐసీసీకి తెలియజేస్తామని, తర్వాతి చర్చల గురించి మాకు సమాచారం ఇస్తామని మాత్రమే చెప్పారు. ఎప్పుడు నిర్ణయం వస్తుందన్నది మాత్రం చెప్పలేదు” అని అమ్జద్ హొసైన్ స్పష్టం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ జట్టు నుంచి ముస్తాఫిజూర్ రహమాన్‌ను విడుదల చేసిన తర్వాత నుంచి, భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసక్తి చూపడం లేదు. భద్రతా కారణాలను చూపిస్తూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీ ని బీసీబీ కోరుతోంది. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా తన వైఖరిని మార్చడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండె జబ్బులు మౌనంగా మృత్యుఘంట.. అసలు కారణాలేంటి.. ఎలా తగ్గించుకోవచ్చు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్..! వీడియో రిలీజ్ చేసిన అశ్విని వైష్ణవ్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు.. విషయం తెలిసి పోలీసులు షాక్
Pooja Hegde: మాస్ పల్స్ తెలిసిందన్న పూజాహెగ్డే.. ఇక దుమ్ము దుమారమే
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

