Donald Trump: సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫస్ట్ యానివర్సరీ.. కంపు చేసిన ట్రంపు నామ సంవత్సరం!
ఒక్కటా రెండా ట్రంప్ పీడిత దేశాలన్నీ ఒక్కతాటిమీదకొచ్చేశాయి. దాదాపు అమెరికాయేత ప్రపంచమంతా కలిసి ఒకటే కోరస్. ఎప్పటికైనా గ్రీన్‌లాండ్ తనదేనన్న ట్రంపరితనంపై ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు పెను సంచలనంగా మారాయి. ట్రంప్‌నకు ఇకమీదట దేత్తడి తప్పదని, గీత దాటితే ఎదురుదాడేనని స్పష్టమైన సంకేతాలిచ్చేశాయి. ఒక్క ఏడాదిలో, ఒకే ఒక్క ఏడాదిలో అమెరికా అధ్యక్షులవారు ఇన్ని టన్నుల వ్యతిరేకతను ఎలా మూటగట్టుకున్నట్టు? డొనాల్డ్ ట్రంప్ అంతటి కరడు గట్టిన విలన్‌గా ఎందుకు మారినట్టు?

ప్రపంచంలోనే అతిపెద్ద అందమైన ద్వీపం గ్రీన్‌ల్యాండ్. ప్రస్తుతం డెన్మార్క్ చేతుల్లో ఉంది. కానీ, దానిమీద డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. మీరు మర్యాదగా ఇస్తేసరి, లేదంటే లాక్కోవడం ఎలాగో నాకు తెలుసు అని హెచ్చరించడమే కాదు. ప్రపంచానికి శాంతి కావాలంటే గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఓ నిర్ణయం జరగాలి అంటూ బ్లాక్‌మెయిలింగ్‌కి దిగేశారు. ఛాయిస్ ఈజ్ యువర్స్ అని గ్రీన్‌ల్యాండ్ విషయంలో నాటోకు అల్టిమేటమ్ కూడా జారీ చేశారు. మీరు ఎస్ అంటే ఓకే. నో అంటే మాత్రం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా..! డొనాల్డ్ ట్రంప్ దాదాగిరీకి పరాకాష్ట ఇది. పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు, ట్రంప్ మేస్టారికి అధ్యక్ష కుర్చీనిచ్చిన అమెరికన్లు.. ఆ విధంగా ప్రపంచం మొత్తాన్నీ పెద్ద రిస్కులోకి తోసేశారు. 79 ఏళ్ల పండు ముసలోడే అయినా పసిపిల్లాడిలా మారాం చేస్తున్న ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలన్నిటికీ తలనొప్పులు మొదలయ్యాయి. సొంత గడ్డ అమెరికా కూడా వీడెవడండీ బాబూ అని నెత్తీనోరూ బాదుకుంటున్నాయంటే.. తొలి ఏడాదిలో ట్రంపరితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కటా రెండా ట్రంప్ పీడిత దేశాలన్నీ ఒక్కతాటిమీదకొచ్చేశాయి. దాదాపు అమెరికాయేత ప్రపంచమంతా కలిసి ఒకటే కోరస్. ఎప్పటికైనా గ్రీన్‌లాండ్ తనదేనన్న ట్రంపరితనంపై ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు పెను సంచలనంగా మారాయి. ట్రంప్‌నకు ఇకమీదట దేత్తడి తప్పదని,...
