Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections: గుజరాత్ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే అంతర్గత సమస్యల ఊబిలో చిక్కుకొని ఉన్న గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

Gujarat Elections: గుజరాత్ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
Bhavesh Katara
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 10, 2022 | 1:01 PM

మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే  అంతర్గత సమస్యల ఊబిలో చిక్కుకొని ఉన్న గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ  దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ ఎమ్మేల్యేలు ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా రాజీనామాలు చేస్తున్నారు.  మంగళవారం  ఆ పార్టీకి  ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేలు గుజరాత్ గవర్నర్ వద్దకు రాజీనామా పత్రాలతో వేర్వేరుగా  వెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

బుధవారం ఉదయం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిన కొద్ది సేపటికే మరో ఎమ్మల్మే అదే బాట పట్టడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కష్టాలు మరింతగా పెరిగాయి. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జలోడ్ భవేశ్ కతరా (Bhavesh Katara) బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.  బుధవారం ఒక్క రోజే ఇది రెండో రాజీనామా కావడం గమనార్హం. బుధవారం ఉదయమే తలాల నియోజకవర్గ ఎమ్మెల్యే భగ్వాన్ భాయ్ డీ బరాడ్ గుజరాత్ గవర్నర్ నిమాబెన్ ఆచార్యకు తన రాజీనామా లేఖను అందజేశారు. తన అనుచరులందరిని సంప్రదించి కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

త్వరలోనే బిజేపీలో చేరబోతున్నానని భగ్వాన్ భాయ్ చెప్పారు. బుధవారం ఈ రెండు రాజీనామాలకు ఒక రోజు ముందుగా మంగళవారం ఎమ్మెల్యే మోహన్సిన్హ్ రాథ్వా  ఆ పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలోకి చేరుతున్నట్లుగా చెప్పిన ఆయన స్వతహాగనే గుజరాత్ రాష్ట్ర గిరిజన నాయకుడు, పైగా పది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి, కాషాయ కండువా కప్పుకుంటున్నారు.  గుజరాత్ రాష్ట్రంలో వరుసగా అధికారం దక్కించుకుంటూ వచ్చిన బీజేపీని ఆ సారి ఎలాగైనా ఒడించాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి వరుస రాజీనామాలతో పార్టీ నాయకులు, వారి వెంటే కార్యకర్తలు కాంగ్రెస్ ను వీడుతున్నపరిస్థితుల్లో ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి మరి..!

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం