Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Mayor: కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు.. మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన మేయర్.. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ

సతీష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పడూ మేయర్ హేమా దేశ్‌ముఖ్ సామూహిక మత మార్పిడి కార్యక్రమానికి హాజరు కావడమే కాదు.. ఏకంగా ఈ మతమార్పిడి కార్యక్రమంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి సంచలనం సృష్టించారు.

Congress Mayor: కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు.. మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన మేయర్.. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
Congress Mayor Hema Deshmukh
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2022 | 11:34 AM

దేశ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు చుక్కాని లేని నావలా తయారై ఓ వైపు అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు సీనియర్ నేతల సహా ప్రముఖ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇంకొక వైపు కొందరు నేతలు వివాదకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పడూ కాంగ్రెస్ పార్టీకి మరొక కష్టాన్ని తెచ్చి పెట్టింది ఆ పార్టీ మేయర్.. కాంగ్రెస్ నాయకురాలు, ఛత్తీస్‌గఢ్‌లోని రాజానందగావ్ మేయర్.. హేమా దేశ్‌ముఖ్ సామూహిక మత మార్పిడి కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో హిందూ దేవుళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ పార్టీ కర్ణాటక నాయకుడు సతీష్ ..’హిందూ అనేది ఓ భయంకరమైన పదం’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సతీష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పడూ మేయర్ హేమా దేశ్‌ముఖ్ సామూహిక మత మార్పిడి కార్యక్రమానికి హాజరు కావడమే కాదు.. ఏకంగా ఈ మతమార్పిడి కార్యక్రమంలో హిందూ దేవతలైన గౌరీ, గణపతి లేదా మరే ఇతర హిందూ దేవుళ్ళను,  దేవతలను ఎన్నటికీ అనుసరించను ..  వారిని ఎప్పుడూ పూజించను. వారు భగవంతుని అవతారమని తాను ఎప్పటికీ నమ్మను” అని ప్రమాదం చేశారు ఈ కార్యక్రమంలో.  ఈ ప్రమాణం  వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఈ విషయంపై బీజీపీ సహా పలువరు ఖండిస్తున్నారు.

ఈ సామూహిక మత మార్పిడి కార్యక్రమం సోమవారం జరిగింది. హిందూ మతంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ ఉద్దేశమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని హేమ దేశ్‌ముఖ్ అంగీకరించారు. అయితే ప్రమాణం గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. “ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా అక్కడ ఉన్నారు. హిందూ వ్యతిరేక ప్రమాణం గురించి నాకు తెలియదని హేమ చెప్పారు. తాను అక్కడ ఉన్నవారు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్నారని భావించానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే అక్కడ ఉన్నవారు హిందూ వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన వెంటనే..  నేను హిందువునైనందున నా దేవుళ్లకు, దేవతలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయనని.. చేతిని కిందకు దించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు వెంటనే తాను ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చేసినట్లు మేయర్ హేమ దేశ్‌ముఖ్‌ ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అయితే హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు చేస్తోన్న జిమ్మిక్కులు అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపిస్తున్నారు. అంతేకాదు “శ్రీకృష్ణుడు జిహాద్ బోధించాడన్న శివరాజ్ పాటిల్ పై లేదా హిందువు అనేది చెడ్డ పదం అంటూ వ్యాఖ్యానించిన  సతీష్ పై ఎటువంటి చర్యలను కాంగ్రెస్ తీసుకోదంటూ వ్యాఖ్యానించారు. హిందువులపై దాడి యాదృచ్చికం కాదు.. ఇది కాంగ్రెస్ నేతల సమిష్టి ప్రయత్నం” అని షెహజాద్ సంచలన ఆరోపణలు చేశారు.

మరోవైపు ‘హిందూ’ అనే పదానికి భయంకరమైన అర్థం చెప్పిన కర్ణాటక కాంగ్రెస్ నేత సతీష్ జార్కిహోళి బుధవారం తన వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..