Pet Dog Kill Snake: యజమాని ప్రాణాలను కాపాడడం కోసం పాముతో పోరాడిన కుక్క.. విశ్వాసం అంటే నీదే అంటున్న నెటిజన్లు
ఒక కుక్క తన ప్రాణాలను పట్టించుకోకుండా ప్రమాదకరమైన పాముతో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజునట్లుగా తెలుస్తోంది.
ప్రజలు తమ ఇళ్లను రక్షించుకోవడానికి కుక్కలను పెంచుకుంటారు. కుక్కలు చాలా శ్రద్ధగా ఇంటిని కాపాడతాయి. అలాగే గుర్తు తెలియని వ్యక్తులను మాత్రమే కాదు ఇతర జంతువులను కూడా ఇంట్లోకి రానివ్వవు. కుక్క వంటి విశ్వాసం గల జంతువు లేదని మరోసారి నిరూపించిందో పెంపుడు శునకం.. యజమానిని కాపాడడం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా పాముతో పోరాడింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక కుక్క తన ప్రాణాలను పట్టించుకోకుండా ప్రమాదకరమైన పాముతో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజునట్లుగా తెలుస్తోంది.
అసలు విషయం ఏమిటి? మీర్జాపూర్ చిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలాతి గ్రామంలో నివసించే ఉమేష్ కుమార్ దూబే తన ఇంట్లో ఓ వీధి కుక్కను పెంచుకుంటున్నాడు. దీని పేరు జూలీ.. ఇదే విషయంపై ఉమేష్ మాట్లాడుతూ..ఓ పాము ఇంటి లోపలికి వస్తుంది. అప్పుడు ఇంటి బయట కాపలాగా ఉన్న జూలీ ఆ పాముని చూసింది. వెంటనే పాముని అక్కడ నుంచి వెళ్లగొట్టడానికి పోరాటానికి దిగింది. దాదాపు 7 నుంచి 8 అడుగుల పొడవు ఉన్న పాముతో జూలీ తన ప్రాణాలను పట్టించుకోకుండా గంటల తరబడి పోరాడింది. చివరికి పామును కొరికి కొరికి కొట్టి కొట్టి చంపేసింది. కుక్కు పాముతో పోరాడుతున్న సమయంలో ఒకరు దూరం నుంచి వీడియో తీసినట్లు తెలుస్తోంది.
జూలీ చాలాసార్లు కుటుంబ సభ్యులను ఇలాంటి ప్రమాదకరమైన పాములు, ఇతర జంతువుల నుండి రక్షించిందని చెప్పాడు. జూలీ తన యజమానిని ప్రమాదం నుంచి కాపాడడం కోసం ఎంతటి పోరాటమైన చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. యజమానిని రక్షించేందుకు కుక్క తన ప్రాణాలను పణంగా పెట్టిందని ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానిక గ్రామస్థుడు చెప్పాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..